Home Blog Page 671

Allu Arjun 22nd Movie Fixed with that Director అల్లు అర్జున్ 22 మూవీ ఆ దర్శకుడితో ఫిక్స్ ?

0

ఇటీవల సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీతో పాన్ ఇండియన్ రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ మూవీ ఓవరాల్ గా రూ. 1670 కోట్ల గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. 

దీని అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థల వారి సినిమా అల్లు అర్జున్ చేయల్సీ ఉంది. ఇది భారీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అత్యధిక వ్యయంతో రూపొందనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. 

ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆ సినిమాని కొన్నాళ్ళు పక్కన పెట్టి దాని ప్లేస్ లో అట్లీతో అల్లు అర్జున్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు. పుష్ప 2 తర్వాత వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు సంపాదించారు అల్లు అర్జున్. దానికి తగ్గట్లు మంచి మాస్ కమర్షియల్ మూవీ చేయాలనేది ఆయన ఆలోచనట. ఇక అట్లీ కూడా జవాన్ మూవీతో అతిపెద్ద విజయం అందుకున్నారు. 

అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దీనిని భారీ వ్యయంతో నిర్మించనుంది.యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ దీనికి సంగీతం సమకూర్చనుండగా త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్టు గురించిన అఫీషియల్ న్యూస్ రానుంది. 

Janhvi Kapoor getting Busy with Continuous Offers వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న జాన్వీ కపూర్

0

దివంగత స్టార్ నటి శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ తొలిసారిగా ధడక్ మూవీ ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. అక్కడి నుండి పలు సినిమాల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం నటిగా వరుస అవకాశాలతో ఆమె కొనసాగుతున్నారు. 

ఇటీవల ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద విజయం అందుకున్న జాన్వి తాజాగా రాంచరణ్, బుచ్చిబాబు సన ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ మూవీ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ఆమె మరికొన్ని ఆఫర్లు అందుకుంటున్నట్టు తెలుస్తోంది. 

ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో యువ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విధంగా ఒకదాని వెంట మరొకటి నటిగా జాన్వీ అవకాశాలతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకుంటూ కొనసాగుతున్నారు. 

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మరికొన్ని సినిమాలు ఆమె సైన్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా తల్లి శ్రీదేవి మాదిరిగానే జాన్వి కపూర్ కూడా చిత్ర పరిశ్రమలో అత్యద్భుత క్రేజ్, మార్కెట్తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. 

Chiranjeevi and JrNtr 2026 Sankranthi Boxoffice Clash 2026 సంక్రాంతికి ఎన్టీఆర్ vs చిరంజీవి బాక్సాఫీస్ క్లాష్ ?

0

టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలానే మెగాస్టార్ చిరంజీవి రానున్న 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్. వివరాల్లోకి వెళితే ఇటీవల దేవర పార్ట్ 1 మూవీతో పెద్ద విజయం అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు. 

మరోవైపు తాజాగా నీల్ తో చేయనున్న మూవీని ఆయన ప్రారంభించారు. నిన్న గ్రాండ్ గా ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదు లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ఈ మూవీని వచ్చేఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ యొక్క రిలీజ్ మరికొంత ఆలస్యం అయి 2026 సమ్మర్ కు వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. 

కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పక్కాగా దీనిని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యాయట. మరోవైపు చిరంజీవి తాజాగా మల్లిడి వశిష్టతో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే దీని అనంతరం ఇప్పటికే అనిల్ రావిపూడి తో ఒక మూవీ చేయడానికి సిద్ధమయ్యారు చిరంజీవి. 

సాహు గారపాటి నిర్మించనున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని పక్కాగా 2026 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. దానితో అటు ఎన్టీఆర్ నీల్ మూవీ, ఇటు చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ పక్కాగా 2026 సంక్రాంతికి క్లాష్ అవ్వటం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ రెండు క్రేజీ మూవీస్ ఏ స్థాయి విజయాలు అందుకుంటాయో తెలియాలి అంటే మరొక ఎనిమిది నెలల వరకు వెయిట్ చేయాలి. 

Anushka Ghaati Release to be Postponed అనుష్క ‘ఘాటి’ రిలీజ్ వాయిదా ?

0

2023లో నవీన్ పోలిశెట్టి హీరోగా మహేష్ బాబు తెరకెక్కించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నారు అనుష్క శెట్టి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో విక్రమ్ ప్రభు మరొక కీలకపాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ఘాటి. 

ప్రారంభం నాటి నుంచి అందరిలో మంచి ఇంట్రెస్ట్ ఏర్పరిచిన ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ పవర్ ఫుల్ గా అందర్నీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది. 

ఈ మూవీని పాన్ ఇండియన్ భాషల్లో యూవి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాని వాస్తవానికి ఏప్రిల్ 18 రిలీజ్ చేయాలని భావించారు అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరింత ఆలస్యం కానుండడంతో రిలీజ్ మరొక రెండు నెలలు వాయిదా పడేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. 

త్వరలో ఘాటి న్యూ రిలీజ్ డేట్ కి సంబంధించి మూవీ టీమ్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుంది. కాగా ఈ మూవీలో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు అనుష్క శెట్టి

Chhaava First Week Boxoffice Collections ‘ఛావా’ మొదటి వారం బాక్సాఫీస్ కలెక్షన్

0

తాజాగా బాలీవుడ్ లో ఛావా మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టే కలెక్షన్స్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక మందన్నల కలయికలో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ అందర్నీ ఆకట్టుకుంటుంది. విక్కీ కౌశల్ అద్భుత యాక్టింగ్ తో పాటు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

Chhaava Boxoffice Collections

ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం ఆయన కుమారుడైన చత్రపతి శంభాజీ మహారాజ్, ఔరంగాజేబును ఎదిరించి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాన్ని తీసుకుని ఈ సినిమా రూపొందింది. ఇక మొదటివారం ఛావామూవీ రూ. 200 కోట్ల నెట్ కలెక్షన్ అయితే సొంతం చేసుకుంది. 

మొత్తంగా ఈ సినిమా రూ. 245 కోట్ల గ్రాస్ ని అందుకోవటం జరిగింది. మరోవైపు ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ అందుకుని వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 290 కోట్లు సొంతం చేసుకుంది. దీని తాజా కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఓవరాల్ గా ఈ మూవీ రూ. 500 కోట్ల గ్రాస్ ని అలానే ఇండియాలో రూ. 400 కోట్ల నెట్ అందుకునే అవకాశం కనబడుతోంది ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ దీన్ని గ్రాండ్ గా నిర్మించింది. 

Hari Hara Veera Mallu Second Song Promo Release ‘​హరి హర వీర మల్లు’ సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్

0

​పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ​కృష్ జాగర్లమూడి​ అలానే జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న సినిమా హరిహర వీరమల్లు పార్ట్ ​1​. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్​ గా నటిస్తుండగా కీలకపాత్ర​ల్లో బాబి ​డియోల్, నర్గీస్ పక్రి​, నోరా ​ఫతేహి, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు​. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ​తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ​ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆస్కార్ సంగీత దర్శకుడు ​ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న హరి​ హర వీర​ మల్లు నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ సాంగ్ పరవాలేదనిపిం​చే రెస్పాన్స్ అందుకుంది​. ఇక తాజాగా ఈ మూవీ నుంచి​ కొల్లగొట్టినాదిరో అనే పల్లవితో సాగె సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు​. 

ఈ ప్రోమోలో పూజిత పొన్నాడ​, అనసూయలతో పాటు పవన్ కళ్యాణ్ ని చూడవచ్చు​. ఈ​ పవర్ఫుల్ పాటని ​మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల​ ఆలపించారు​. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమోకి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది​. ఇక హరిహర వీరమల్లో మూవీ మార్చి 28​న సమ్మర్ కానుకగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి

More Setbacks for Shankar

0

Shankar, who was once the most sought-after blockbuster director on a pan-India level is now witnessing the lowest point of his career. Known for his blockbuster streak and having never seen a box-office flop, the ace director’s career is in a major slump with no blockbuster since Robo (2010).

After Robo, he chose to do a remake for the first time with Nanban (3 Idiots) which wasn’t a massive hit as expected. Next, he directed ‘I’ which was massively hyped before it was released. Starring Vikram and Amy Jackson, this film also failed to receive the box office success everyone hoped for.


Back-to-Back Disasters Raise Questions

Robo’s sequel ‘2 Point 0’ also couldn’t give him a proper success. With Indian 2, he saw his career’s lowest point as the Kamal Haasan starrer was a massive disaster. It was the first of such sorts for the maverick director. Game Changer, which was released last month added to Shankar’s woes and was another massive failure for the director.

With the future of Indian 3 looking bleak, it needs to be seen if Shankar would even go ahead with the film or not. Due to his box-office run in the last decade and his image as a big-budget director, finding a producer has become quite tough. He announced that Velpari would be his upcoming project. But finding someone to bankroll this film has become quite challenging.

ED Troubles for Shankar

Amidst these professional struggles, Shankar has faced another major shock. ED, earlier today attached assets worth Rs 10.11 crores under the Prevention of Money Laundering Act (PMLA), 2002. The action was taken following a complaint by Tamil writer Aarur Tamilandan who claimed portions of the ‘Robo’ story belonged to him.

“Based on substantial evidence and records in hand, it has been determined that S Shankar has violated Section 63 of the Copyright Act, 1957—a violation now classified as a scheduled offense under the PMLA, 2002,” the ED said in a statement. The attachment of properties under PMLA provisions indicates that the agency suspects the proceeds of the alleged copyright infringement may have been laundered or integrated into Shankar’s assets.

Allu Aravind’s next target Nagarjuna

0

The Production House of Allu Aravind, Geetha Arts comes as very lucky for the Akkineni Family. Naga Chaitanya has recently witnessed big success with Thandel produced by Geetha Arts. The film also became his solo highest-grosser at his career’s lowest phase. The Banner also managed to give the first commercial success to Akhil with Most Eligible Bachelor.

Now, it is learned that the Banner is trying to make a film with Nagarjuna. This was also expressed in the success meet of Thandel and the discussions are reportedly on regarding this. Nagarjuna after his Naa Saami Ranga hasn’t committed to any solo film apart from Kubera which co-stars Dhanush and Coolie co-starring Rajinikanth.

So, there is a high chance that Chandoo Mondeti, the Director of Thandel, direct Nagarjuna again in the same Production House. The Director is also a big fan of Nagajuna which will also make it an interesting combination. All these are still in the discussion stage, but a film with Nagarjuna will surely happen.

Jaabilamma Neeku Antha Kopama Movie Review: An Entertaining and Lighthearted Take with Some Flaws

0

Movie Name: Jaabilamma Neeku Antha Kopama
Rating: 2.75/5
Cast: Pavish Narayan, Anikha Surendran, Priya Prakash Varrier, R Sarathkumar and others
Director: Dhanush
Produced By: Dhanush, Kasthuri Raja, Vijayalakshmi Kasthuri
Release Date: 21st February 2025

Jaabilamma Neeku Antha Kopama is the latest romantic comedy. The film is originally made in Tamil, titled as NEEK (Nilavuku Enmel Ennadi Kobam) and it is directed by Dhanush, Anikha Surendran and other young actors in the lead roles. Let’s check out how the film has been shaped up.

Story:

NEEK’s story is about Prabhu (Pavish Narayan) and Preethi (Priya Prakash Varrier), who are childhood friends and meet for a marriage alliance. They have a good time together, and all seems okay until Prabhu finds out that Nila (Anikha Surendhan), his previous girlfriend, is about to get married. Prabhu tells about his past love life to Preethi, and the rest of the story follows how these young people navigate their lives.

Performances:

Pavish looks like Dhanush with his clean-shaven appearance, giving off a boy-next-door vibe. He performs impressively. Anikha Surendran plays Nila decently, while Venkatesh Menon and Rabiya Khatoon are okay in their roles as Ravi and Shriya. Ramya Ranganathan is impressive in her character as Anjali. But it is Matthew Thomas, who gets the routine friend role, provides many laughs. Priya Prakash Varrier and R Sarathkumar are fine.

Analysis:

In NEEK, directed by Dhanush, the characters and screenplay emphasize practical aspects over emotional ones. The serious scenes in the film just come as small flashes, and do not stress the effect. The film tries to tickle all the boxes that connect to Gen Z themes. Youngsters meeting at the parties and taking the life-changing decisions in quick time is shown perfectly.

The entertaining parts in both the first and second halves work effectively. However, there are still elements of dullness and predictability in the proceedings. The climax also looks somewhat weird.

Positives:

  • Performances
  • Entertainment
  • Music

Negatives:

  • Dull Moments at a Few Places
  • Predictable Scenes/Twists
  • Climax

Jaabilamma Neeku Antha Kopama Movie Review and Verdict:

While Dhanush’s NEEK (Jaabilamma Neeku Antha Kopama) includes some weak and predictable moments, it ultimately serves as an entertaining and lighthearted film that can be enjoyed by audiences who prioritize enjoyment over seriousness.

Nani Movie with Tamil Director Fixed నానితో తమిళ్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ 

0

ఇటీవల వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి విజయం అందుకున్న న్యాచురల్ స్టార్ నాని. కాగా ఆయన ప్రస్తుతం హిట్ 3 మూవీ చేస్తున్నారు. ఈ మూవీపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇక దీని అనంతరం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ మూవీ చేయనున్నారు నాని. అతి త్వరలో ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ టీజర్ కూడా రానుంది. ఇక ఈ రెండిటి అనంతరం తాజాగా తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో కూడా ఒక మూవీ చేసేందుకు నాని సిద్ధమయ్యారు. 

వాస్తవానికి హిట్ 3, ది పారడైజ్ తో పాటు సుజిత్ తో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారు నాని. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి మూవీని సుజిత్ తీస్తుండటంతో అది కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. అందువలన సుజీత్ మూవీని ప్రస్తుతం ప్రక్కన పెట్టారు నాని. దానితో సిబి చక్రవర్తితో నాని చేయనున్న సినిమా ప్రస్తుతం లైన్ లోకి వచ్చింది. 

వాస్తవానికి శిబి చక్రవర్తి, శివ కార్తికేయన్ తో సినిమా చేయాల్సి ఉంది కాగా ప్రస్తుతం ఆయన సుధా కొంగరతో పరాశక్తి మూవీ చేస్తున్నారు. దానితో నాని మూవీ చేయడానికి ఆయనకు లైన్ క్లియర్ అయింది. త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.