Home Blog Page 654

Huge Budget for Nani The Paradise Glimpse నాని ‘ ది ప్యారడైజ్’ గ్లింప్స్ కోసం భారీ ఖర్చు ?

0

నాచురల్ స్టార్ నాని ఇటీవల సరిపోదా శనివారం సినిమా మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి అతిపెద్ద విజయం అందుకున్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న హిట్ 3 సినిమా మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 

అయితే దీని అనంతరం త్వరలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ మూవీ చేయనున్నారు నాని. ఈ మూవీపై అందరిలో కూడా మంచి హైప్ నెలకొని ఉంది. ఎస్ ఎల్ వి సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ మార్చి 3న రిలీజ్ కానుంది. 

అయితే విషయం ఏమిటంటే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ తోపాటు ఇంగ్లీష్ మరియు స్పానిష్ వంటి ఇంటర్నేషనల్ భాషల్లో కూడా ఈ టీజర్ రిలీజ్ కానుంది. అలానే ఈ గ్లింప్స్ టీజర్ కోసం టీమ్ దాదాపుగా రూ. 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్లు టాలీవుడ్ టాక్. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ గ్లింప్స్ లో ఉండనున్నాయట.

దీన్ని బట్టి చూస్తే పారడైజ్ మూవీని భారీ స్థాయిలో గ్లోబల్ గా కూడా ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు యష్ హీరోగా తాజాగా గీతూ మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్ కూడా ఇదే విధంగా గ్లోబల్ రేంజ్ లో సిద్ధం అవుతుంది. 

Tillu Cube in 2026

0

Tillu Square starring Siddhu Jonnalagadda became a sensational blockbuster last year grossing more than 120 crores worldwide. The team has planned a third part in the film series, Tillu Cube, immediately. Fans and audiences were also excited to hear about the planning of the third part.

Now, in the MAD Square promotions yesterday, the team has also officially confirmed that the Director of MAD Square, Kalyan Shankar, had begun his work on Tillu Cube. Siddhu Jonnalagadda has also been a part of the Story department of both films of the series, and it can be understood that the duo will work on the story of Tillu Cube.

Siddhu Jonnalagadda is also busy with his films, Jack and Telugu Kada. Director Kalyan Shankar is also said to be planning a film starring Ravi Teja, and the work will also happen after the release of his MAD Square. The story discussions are also said to have happened already. So, the duo’s commitments are expected to be done this year, and they may take Tillu Cube on sets next year.

Atlee’s 100 crore demand?

0

Director Atlee has been unsuccessful in doing a film after his Jawan starring Shah Rukh Khan which grossed more than 1000 crores worldwide. The Director initially planned a film with Allu Arjun and had discussions, but this didn’t go forward with the planned film shelving later.

The Director is facing issues regarding the budget plans. The planned film with Allu Arjun was also shelved for the same reason, and he had also planned a multi starrer with Salman Khan and Kamal Haasan. But this too was reported to be shelved for the same reason.

After the humongous success of Pushpa 2, Atlee is back again with his plan to rope Allu Arjun. Both are also said to be demanding higher and record remunerations. The film’s budget will also be very higher to make it a Pan Indian film, and this is worrying the Producers now.

There is a buzz that Atlee is keen on receiving 100 crores as remuneration and Allu Arjun too wants a whopping 250 crores. If this holds truth, then the budget will rocket to around 700 crores which will also be a big risk. OTT business is also on the down trend now with the Satellite platform already hitting the rock bottom. The film can fetch a 300 crore range number as non-theatricals, and still it needs 400 crores from the theatrical performance. This means that the film must collect at least 800 crores theatrically just for the break even mark.

This is definitely a big risk for the Producers. They might believe that a budget around 500 crores will be a good one, but we need to see how the discussions result. Going with some remuneration in advance and share profits after the theatrical performance might work for both the parties.

Marco OTT Getting Poor Response from Telugu Audiance ‘మార్కో’ ఓటిటి : తెలుగు ఆడియన్స్ నుండి పూర్ రెస్పాన్స్

0

ఇటీవల ఉన్నిముకుందన్ హీరోగా తెరకెక్కిన మలయాళ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ మార్కో. హనీఫ్ అదేని ఈ మూవీని తెరకెక్కించగా క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ సంస్థలు ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించాయి.

మలయాళంలో అందర్నీ ఆకట్టుకుని ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్న ఈ మూవీ అనంతరం తెలుగులో కూడా డబ్ కాబడి ఇక్కడ ఆడియన్స్ ని కూడా అలరించింది. ముఖ్యంగా యాక్షన్ తో కూడిన రివెంజ్ డ్రామాగా ఆకట్టుకునే కథ, కథనాలతో అలరించే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన మార్కో మూవీ అందరి నుంచి మంచి స్పందన అందుకుంది. 

తెలుగు ఆడియన్స్ కూడా థియేటర్స్ లో దీనికి మరింతగా మంచి రెస్పాన్స్ అందించారు. అయితే ఇటీవల ప్రముఖ ఓటిటి మాధ్యమం సోనీ లివ్ ద్వారా ఫిబ్రవరి 14న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్ లో ఓటిటి ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే తెలుగు ఓటిటి ఆడియన్స్ నుంచి మాత్రం ఈ సినిమాకి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అయితే రావడం లేదు. 

ఇక హిందీ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్టీమ్ కాబడి పరవాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. త్వరలో మార్కోకు సీక్వెల్ అయిన మార్కో 2 సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. దానిని పార్ట్ 1 నుంచి మరింత గ్రాండ్ లెవెల్ లో తరకెక్కించుకున్నారట. 

డ్రాగన్ : ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ 

0

తమిళ యువనటుడు కం దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా డ్రాగన్. ఇటు తెలుగులో ఈ మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్ తో రిలీజ్ అయింది. కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

యూత్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన డ్రాగన్ మూవీ ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కలెక్షన్ తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా తమిళనాడులో రూ. 40 కోట్లు కు పైగా రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల వరకు రాబట్టింది. 

ఇక రెస్టాఫ్ ఇండియా కలిపి మొత్తం ఇండియాలో రూ. 57 కోట్లు ఈ సినిమా రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్ లో కూడా డ్రాగన్ అదరగొడుతూ దూసుకెళ్తోంది. అక్కడ 2.25 మిలియన్ డాలర్స్ అనగా దాదాపుగా రూ. 19 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 76 కోట్లతో దూసుకెళ్తోంది డ్రాగన్. 

ఈ దూకుడు చూస్తుంటే అతి త్వరలో ఈ సినిమా రూ. 100 కోట్లకు చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఆకట్టుకునే కథ కథనాలతో పాటు నటుడు ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెప్పాలి

Baapu hits OTT in just 2 weeks

0

Baapu starring Brahmaji, Amani, Sudhakar Reddy, Dhanya Balakrishna, Srinivas Avasarala, Rachha Ravi and few others released on 21st February. The film released below par reviews and with no hype and positive word of mouth, the film failed to work in the theatres. It also ended up with a zero share at the box office.

The film is also set to come to the OTT platform now within just 2 weeks after its theatrical release. The film will arrive on 7th March on Jio Hotstar. The team has put high hopes on the OTT performance now with the theatrical performance resulting in the disaster status.

The film will definitely be a watchable one on the OTT platform for its sincere attempt and the heart touching performances of the cast. Few films have also become successful on the OTT platforms after their disappointing performance at the box office. So, let’s see how Baapu performs in the OTT space.

Kannappa Teaser 2: Big Stars – Poor Visuals

0

Manchu Vishnu’s Kannappa 2nd teaser is out now. It is widely known that the film is a dream project for the actor, and it is being made as a pan-Indian film involving actors from different industries in Indian cinema. However, despite having all the big stars, Kannappa Teaser 2 could not impress due to poor visuals.

Manchu Vishnu’s Kannappa Teaser 2 Disappoints

If we observe the teaser of the film, it has all the big stars showcased in crucial parts. Also, the locations seem to be very repetitive, and it feels like the entire film was made in very few locations and the visuals also do not look grand. 

Kannappa Teaser 2

Normally, for these kinds of films, audiences expect a huge number of people and big war scenes, but nothing is seen in the teaser. Manchu Vishnu’s Kannappa teaser 2 Kannappa Teaser 2 could not impress due to poor visuals despite having all the big stars.

Kannappa needs more strong promotional content to create buzz

Moreover, the devotional or emotional parts were not established in the teaser. The one and only big positive from the teaser is the last shot, which shows Prabhas. That particular shot gives the high, while the rest of the teaser falls flat.

The makers of Kannappa claim that they have put a record budget for the film, but still, it is not showcased in the film’s visuals. The film is releasing in theaters worldwide on 25 April 2025, and it certainly needs much bigger content to create the required buzz.

Good Bad Ugly Teaser Smashes Records

0

Ajith’s upcoming film, Good Bad Ugly, created a solid buzz right from the start. The film’s teaser was released lately, and the craze is now on a new level, as Good Bad Ugly teaser smashes records and receives a massive response from all audiences.

Thala Ajith’s Good Bad Ugly Teaser is a Blockbuster

The teaser has created an all -time record for 24 hours with more than 30 million views. Also, it became the 1st Kollywood teaser to cross 20M, 25M, 30M views milestone in first 24 hours which says how big the teaser has worked among audiences.

The Telugu and Hindi version teasers are also out now, and the fans of Ajith Kumar are praising the director Adhik Ravichandran like anything. Ajith’s Good Bad Ugly teaser smashes records and receives a massive response from all audiences.

Ajith Kumar’s Good Bad Ugly Teaser – Telugu

Box Office: Good Expections for the film in Telugu

The film is expected to do well in Telugu as well because the renowned production house, Mythri Movie Makers, are the producers for the film, and they will do aggressive promotions. Already, the teaser has created buzz among Telugu audiences.

Daaku Maharaaj Overall Detailed Analysis ‘డాకు మహారాజ్’ : ఓవరాల్ డిటైల్డ్ ఎనాలిసిస్

0

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డాకు మహారాజ్. ఫస్ట్ డే మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ రాబట్టింది. ఈ మూవీలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, సచిన్ ఖేడేకర్, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు.

Movie Colloboration

వాస్తవానికి అంతకముందు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణ, తొలిసారిగా వాల్తేరు వీరయ్యతో పెద్ద విజయం అందుకున్న బాబీతో ఈ మూవీ చేయడంతో మొదటి నుండి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఈ మూవీకి మొదట బీజం పడింది.

అంతకముందు కొన్నాళ్లుగా తనకి ఇష్టమైన బాలకృష్ణ గారితో మూవీ చేయాలనీ భావిస్తున్న తనకు డాకు మహారాజ్ తో ఆ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ చెప్పారు. ఇక గత మూడు బాలయ్య సినిమాలకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టిన ఎస్ థమన్, మరొక్కసారి డాకు మహారాజ్ తో తన మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ అలరించి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్నారు. 

Daaku Maharaj Initial Plans

వాస్తవానికి ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ ఇందులో ఒక కీలక పాత్ర చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి, అయితే సినిమా రిలీజ్ అనంతరం అది నిజం కాదని అర్ధమైంది. ఇక ఈ మూవీ 2023 జూన్ 10న బాలకృష్ణ జన్మదినం సందర్భంగా గ్రాండ్ గా మొదలై ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. వాస్తవానికి మూవీని 2024 సమ్మర్ కానుకగా టార్గెట్ పెట్టుకుని మేకర్స్ రిలీజ్ చేద్దాం అని భావించారు అయితే కొన్నాయి అనివార్య కారణాల వలన అది వాయిదా పడుతూ 2025 సంక్రాంతికి వెళ్ళింది.

Daaku Maharaj Pre Release Business and Buzz

ఇక డాకు మహారాజ్ కాంబో ఫై మొదటి నుండి అందరిలో మంచి క్రేజ్ ఉండడంతో దీని యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ముందుగా డాకు మహారాజ్ నుండి రిలీజ్ అయిన టీజర్ బాగా రెస్పాన్స్ అందుకోగా సాంగ్స్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకోలేదు. అనంతరం రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక డాకు మహారాజ్ మూవీ ఓవరాల్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్ల మేర బిజినెస్ జరుపుకుని బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది. 

Daaku Maharaaj Movie Review

ఇక ఈ మూవీ యొక్క రివ్యూ పరంగా చూస్తే ఓవరాల్ గా ఇది మంచి కమర్షియల్ మూవీ అని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ పెర్ఫార్మన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొన్ని టెరిఫిక్ షాట్స్ అలానే హై మూమెంట్స్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు మూవీ బాలకృష్ణ కెరీర్ లో పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని అందరూ భావించారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆకట్టుకోదు. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కొన్ని హై యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ వీక్ విలన్ క్యారెక్టర్, సాదాసీదాగా ఉండే క్లైమాక్స్ వంటివి మూవీని సాధారణ విజయం వద్ద ఆపేసాయి. 

Daaku Maharaaj Box Office Collection

ఇక ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి బాగా రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా మొదటి రోజు సెకండ్ షోస్ బాగా ఫుల్ కావడంతో రెండవ రోజు నుండి మూవీ బాగా పెర్ఫార్మ్ చేస్తుందని అందరూ భావించారు.

అయితే అంత అద్భుతంగా కాకపోయినా ఒకింత పర్వాలేదనిపంచేలా కలెక్షన్ అందుకున్న ఏ మూవీ ఓవరాల్ గా రూ. 100 కోట్ల షేర్ దాటుతుందని అనుకున్నారు. అయితే ఫైనల్ గా డాకు మహారాజ్ మాత్రం రూ. 80 కోట్ల వద్ద ఆగిపోయింది. మరోవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం అదరగొడుతూ ఉండడం కూడా ఒక కారణం. 

Daaku Maharaaj Roars In Netflix

ఇక డాకు మహారాజ్ మూవీ బాక్సాఫిస్ సక్సెస్ అనంతరం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక అన్ని భాషల ఆడియన్స్ నుండి బాగా రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ 2.4 మిలియన్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో 13 దేశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ గ్లోబల్ గా ఐదవ పొజీషన్ లో నిలిచింది. అలానే ఇటు ఇండియాలో ఈ మూవీ నెంబర్ వన్ పొజీషన్ లో నిలిచింది. 

Daaku Maharaaj Final Word: Nandhamuri Balakrishna Rises to Another Level

మొత్తంగా నటసింహం నందమూరి బాలకృష్ణ, బాబీ ల తొలి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ డాకు ,మహారాజ్ అటు థియేటర్స్ లో ఇటు ఓటిటి లో బాగానే పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా బాలకృష్ణ సూపర్ పెరఫార్మన్స్ తో పాటు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ తో పాటు కొన్ని భారీ యాక్షన్, హై మూమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే క్లైమాక్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకుని రిలీజ్ డేట్ కూడా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా డాకు మహారాజ్ మరింతగా పెర్ఫార్మ్ చేసేదని చెప్పాలి. 

మరి ఇంకా ఈ మూవీ చూడని వారు ఉంటె, వీలైతే నెట్ ఫ్లిక్స్ లో చూడండి, తప్పకుండా మిమ్మల్ని ఈ మూవీ ఆకట్టుకుంటుంది. 

Coolie That Song will be Hilarious ‘కూలీ’ : ​ఆ సాంగ్ అదిరిపోనుందట

0

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న మాస్ గ్యాంగ్ స్టర్ భారీ యాక్షన్ డ్రామా సినిమా కూలీ. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. శృతిహాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున తదితరులు కీలక రోల్స్ లో నటిస్తున్న కూలీ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. 

అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన అనౌన్స్ మెంట్ టీజర్ కాని ఫస్ట్ సాంగ్ కానీ అందర్నీ ఆకట్టుకొని ఇప్పటివరకూ ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. త్వరలో ఈ మూవీ నుంచి మరొక అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. 

విషయం ఏమిటంటే ఈ మూవీలో రజనీకాంత్ తో కలిసి పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఆమె అఫీషియల్ ఫస్ట్ లుక్ నిన్న రిలీజ్ చేయగా అది ఏమాత్రం ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు.ఆమెకు సంబంధించి ఏదైనా ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేస్తారేమోనని అందరు భావించారు కానీ జస్ట్ ఆమె లుక్ యొక్క ఫోటో మాత్రమే రిలీజ్ చేసి సరిపెట్టారు మేకర్స్.

అయితే విషయం ఏమిటంటే, పూజా హెగ్డే చిందేయనున్న ఈ సాంగ్ ఓవరాల్ గా మూవీలో అదిరిపోతుందని, ముఖ్యంగా ఈ సాంగ్ ఆడియో పరంగానే కాక విజువల్ గా కూడా అందరికీ మంచి ఫీస్ట్ అందిస్తుందని త్నున్నారు. మరి ఓవరాల్ గా రిలీజ్ అనంతరం కూలీ మూవీ ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.