Home Blog Page 650

Finally Manamey Ready for OTT Release ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కు సిద్దమైన శర్వానంద్ ‘మనమే’ 

0

తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు చేస్తూ ఆడియన్స్ యొక్క మనసు చూరగొంటూ కొనసాగుతున్న నటుల్లో శర్వానంద్ కూడా ఒక్కరు. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విభిన్న కథ కథనాలతో రూపొందే ఆయన సినిమాలు నటుడిగా ఆయనకు మంచి క్రేజ్ అందిస్తున్నాయి. ఆ విధంగా గతేడాది యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతి శెట్టి కలయికలో వచ్చిన మూవీ మనమే. 

యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయమైతే అందుకోలేదు. అయితే నటుడిగా శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి తమ పాత్రల్లో అలరించే పెరఫార్మన్స్ కనబరిహరు. కాగా బాక్సాఫీస్ రన్ అనంతరం ఈ సినిమా యొక్క ఓటిటి కోసం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. 

కాగా ఫైనల్ గా ఏడాది తర్వాత తాజాగా ఈ సినిమా ఓటీటి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా మనమే మూవీ మార్చి 9 నుంచి ప్రసారం కానుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ కృతి శెట్టి తో పాటు బాల నటుడు విక్రమాదిత్య పాత్ర కూడా అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. 

శీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, ఆయేషా ఖాన్, రాహుల్ రామకృష్ణ, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూర్చారు. మరి థియేటర్స్ లో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా ఎంత మేర ఓటిటి ఆడియన్స్  నిఅలరిస్తుందో చూడాలి. 

Chhaava Telugu Trailer Increases Hype అంచనాలు పెంచేసిన ‘ఛావా’ తెలుగు ట్రైలర్

0

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల కలయికలో లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఛావా. మ్యాడాక్ ఫిలింస్ సంస్థపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా కీలకపాత్రల్లో అశుతోష్ రానా, డయానా పెంటి, దివ్య దత్త, అక్షయ్ ఖన్నా తదితరులు నటించారు. 

హిందీలో ఇప్పటికే రూ. 500 కోట్లు దాటి రూ. 600 కోట్ల వైపు పరుగులు తీస్తున్న ఛావా మూవీ మార్చి 7న గ్రాండ్ గా తెలుగు ఆడియన్స్ ముందుకు రానుంది. విషయం ఏమిటంటే నిన్న ఉదయం ఈ సినిమా యొక్క తెలుగు థియేట్రికల్ రిలీజ్ చేశారు. కాగా తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ అయితే లభిస్తుంది. 

ముఖ్యంగా తెలుగు వర్షన్ ట్రైలర్లో డబ్ చేసిన డైలాగ్స్ తో పాటు పవర్ఫుల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో విక్కీ కౌశల్ పెర్ఫార్మన్స్ మరింత ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా అయితే ఛావా తెలుగు ట్రైలర్ మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసిందని చెప్పాలి. మరి మార్చి 7న తెలుగులో రిలీజ్ అనంతరం ఛావా ఇక్కడ ఆడియన్స్ ని ఎంత మేర మెప్పించి ఏ స్థాయిలో కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. 

ఇక ఈ సినిమా యొక్క తెలుగు హక్కులని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వారు సొంతం చేసుకున్నారు అలానే తెలుగులో ఈ సినిమాని వీలైనంత ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు కూడా వారు ప్లాన్ చేస్తున్నారు. 

Atlee Demanding High Remuneration భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న అట్లీ

0

ఇటీవల పుష్ప 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు కొన్నాళ్లుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆ భారీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలానే సమయం పట్టనుందట. 

అందుకే ఈలోపు అట్లీతో అల్లు అర్జున్ ఒక సినిమాకు కమిటీ అయ్యారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి డిస్కషన్స్ అటు అల్లు అర్జున్ ఇటు అట్లీ మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని కాగా అది సన్ పిక్చర్స్ అని అంటున్నారు. 

అయితే ఈ సినిమాకి సంబంధించి కొద్ది సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమా పరంగా దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ దాదాపుగా రూ. 100 కోట్లు అడుగుతున్నారట. మరోవైపు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తో కలిపి ఇది రూ. 250 నుంచి రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక సినిమా బడ్జెట్ కూడా కలిపితే ఇది రూ. 600 కోట్లు అవుతుందని ఒకరకంగా ఇది నిర్మాతకు రిస్క్ అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి సన్ నెట్వర్క్ సంస్థతో చర్చలు జరుగుతున్నాయట. 

కాగా త్వరలో పక్కాగా ఈ మూవీకి సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్ కూడా వస్తుందనే వార్తలు వస్తున్నాయి. అలానే ఈ సినిమా కోసం యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ ని తీసుకుంటున్నారట దర్శకుడు అట్లీ. ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. 

Tillu Cube will be Released on 2026 ‘టిల్లు క్యూబ్’ రిలీజ్ అయ్యేది 2026 లోనే 

0

తెలుగు సినిమా పరిశ్రమలో యువ నటుడిగా మంచి విజయాలతో జోరు మీద కొనసాగుతున్న వారు సిద్దు జొన్నలగడ్డ. ఇటీవల డీజే టిల్లు సినిమాలో తన మార్క్ ఎంటర్టైనింగ్ యాక్టింగ్ స్టైల్ తో యువతలో విశేషమైన క్రేజ్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత గత తేడాది దానికి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. 

ఈ సినిమా మరింత భారీ విజయముందుకుని ఓవరాల్ గా రూ. 120 కోట్ల వరకు గ్రాస్ అయితే సొంతం చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇక త్వరలో ఈ సినిమా యొక్క మూడో భాగం అయిన టిల్లు క్యూబ్ రూపొందనుందని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసారు. 

ఈ సినిమాని మరింత గ్రాండియర్ గా రూపొందించనున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం పలు ప్రాజెక్టుతో సిద్దు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు మ్యాడ్ స్క్వేర్ మూవీతో బిజీగా ఉన్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ టిల్లో క్యూబ్ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ నైతే పూర్తి చేశానని త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

తప్పకుండా రెండు పార్టులని మించి ఈ మూడో పార్ట్ మరింత ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని యువతని విశేషంగా ఆకట్టుకుంటుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. కాగా ఈ సినిమా పక్కాగా 2026 లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి పక్కాగా టిల్లు క్యూబ్ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. 

బాక్సాఫీస్ వద్ద చతికలపడ్డ ‘మజాకా’

0

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లతో మంచి సక్సెస్ లు అందుకుంటూ కొనసాగుతున్న దర్శకుల్లో త్రినాధరావు నక్కిన కూడా ఒకరు. తాజాగా సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్, అన్షుల కలయికలో ఆయన తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా మజాకా. ఈ మూవీకి లియాన్ జేమ్స్ సంగీతం అందించగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ దీనిని గ్రాండ్ గా నిర్మించారు. 

మొత్తంగా మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ కామెడీ మూవీ ఇటీవల ఫిబ్రవరి 26న ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి కలెక్షన్స్ అయితే అందుకోలేకపోతోంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకి చాలా తక్కువస్థాయి కలెక్షన్ వస్తుండడంతో టీంకి షాక్ ను కలిగిస్తోంది. 

ఇటీవల మజాకా సక్సెస్ మీట్ లో దర్శకుడు అండ్ టీం మాట్లాడుతూ తమ సినిమా అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించామని మరోవైపు కలెక్షన్స్ మరింతగా రాబోయే రోజుల్లో పెరుగుతాయనేటువంటి ఆశాభావం అయితే వారు వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన మార్కు కామిడీ ఎంటర్టైన్మెంట్ అంశాలు జపించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రావు రమేష్, రీతు వర్మ, అన్షు అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్అ లతో లరించారు. 

విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికలపడడం బట్టి చూస్తే సందీప్ కిషన్ కెరీర్ లో మరొక డిజాస్టర్ గా మజాకా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు బయ్యర్లకు ఏ సినిమా 1/3 వ వంతు మాత్రమే పెట్టుబడిని రాబట్టే అవకాశం కనపడుతోంది. మరి ఓవరాల్ గా మజాకా మూవీ ఎంతమేర కలెక్షన్ అందుకుంటుందో తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 

Sankranthiki Vasthunam beats RRR Hanuman OTT Records ఓటిటిలో ఆర్ఆర్ఆర్, హనుమాన్ రికార్డ్స్ బద్దలుకొట్టిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

0

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చారు. ఆకట్టుకునే ఫ్యామిలీ యాక్షన్ మూవీగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం మొన్న జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమై మంచి రెస్పాన్స్ అందుకుంది. 

మరోవైపు ఈ మూవీ అదే రోజున జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చింది. విషయం ఏమిటంటే, ఈ సినిమా జీ5 ఓటీటీలో ఆర్ఆర్ఆర్, హనుమాన్ రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమా కేవలం కొన్ని నిమిషాల్లోనే 100 మిలియన్ నిమిషాలకు పైగా  వ్యూస్ ని సొంతం చేసుకుంది. అలానే 12 గంటల్లో దాదాపుగా 1.3 మిలియన్ వ్యూయర్స్ చూసిన మూవీగా ఇది గతంలోని ఆర్ఆర్ఆర్, హనుమాన్ ల రికార్డులని బద్దలుకొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

మరోవైపు ఈ సినిమా టిఆర్పి పరంగా కూడా భారీ స్థాయిలో రాబట్టే అవకాశం కనబడుతోంది. ఆ విధంగా ఓవైపు థియేటర్స్ లో మరోవైపు ఓటీటిలో ఇంకోవైపు బుల్లితెరపై కూడా అదరగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ 2026లో తెరకెక్కి 2027 జనవరిలో ఆడియన్స్ ముందుకు రానుంది

Thandel OTT Release Date Announcement ‘తండేల్’ ఓటిటి రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్

0

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకుంది. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందిన తండేల్ మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన యాక్టింగ్ తో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, లవ్, ఎమోషనల్ సీన్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. 

కాగా ఓవరాల్ గా థియేటర్లో రూ. 90 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టిన ఈ మూవీ మార్చి 7న ఓటిటి ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. 

ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఓటిటి ఆడియన్స్ ముందుకు రానుంది. మరి థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఎంత మేర ఓటీటీలో మెప్పిస్తుందో చూడాలి

Producer Interesting Comments on Ntr Neel movie ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఒక భారీ పాన్ ఇండియన్ మాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మలయాళ నటుడు టోవినో థామస్ ఒక కీలక పాత్ర చేస్తుండగా కన్నడ అందాల నటి రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. 

మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ పై అందరిలో ఎన్నో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం అయింది. 

ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అయిన డ్రాగన్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. 

ఆ సందర్భంగా జరిగిన సక్సె మీట్ లో భాగంగా మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్, నీల్ ల సినిమా యాక్షన్ తో కూడినదని, అలానే అది కూడా డ్రాగన్ అని టైటిల్ అనౌన్స్ చేసారు. అలాగని తమిళ్ సినిమా డ్రాగన్ ని తక్కువ చెయ్యాలని కాదు. 

అయితే వారిద్దరి క్రేజీ కాంబో సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది, దానిని ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసే ప్లాన్ ఉందన్నారు. కాగా తమిళ్ సినిమా డ్రాగన్ హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది, తదుపరి రానున్న ఎన్టీఆర్ నీల్ ల డ్రాగన్ సినిమా సినీ ప్రపంచం మొత్తాన్ని మొత్తాన్ని చుట్టేస్తుందని తెలిపారు. కాగా ఈ మూవీ 2026 జనవరిలో రిలీజ్ కానున్నట్లు ఇటీవల మేకర్స్ డేట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 

Prabhas Prasanth Varma Movie Starts Then Only ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ పట్టాలెక్కేది అప్పుడే 

0

ప్రస్తుతం వరుసగా సినిమాలతో కెరీర్ పరంగా బిజీ బిజీగా కొనసాగుతున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఇక ఆయన చేస్తున్న ప్రస్తుత సినిమాల అనంతరం తాజాగా హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో బ్రహ్మ రాక్షస అనే మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్. అయితే ఈ టైటిల్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఈ మూవీలో ప్రభాస్ ని ఒక సరికొత్త లుక్ లో చూపించేందుకు సిద్ధమయ్యారు ప్రశాంత్ వర్మ. 

ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా రూపొందుతోంది. ప్రభాస్ కి ఈ స్క్రిప్ట్ బాగా నచ్చటంతో నిన్న దీనికి సంబంధించి ఒక లుక్ టెస్ట్ ని ఫోటోలు మరియు వీడియోలతో సహా నిర్వహించారు. ఇందులో ప్రభాస్ తన పాత్రలో అద్భుతంగా ఆకట్టుకున్నారట. అయితే ప్రభాస్ తన డేట్స్ ఖరారు చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. 

ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మించనుండగా స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ-విజువలైజేషన్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రశాంత్ వర్మ ఇటీవల బ్లాక్ బస్టర్ హనుమాన్ గత సంక్రాంతికి విడుదలైనప్పటికీ, అతను ఇంకా కొత్త సినిమా షూటింగ్స్ ప్రారంభించలేదు. అయినప్పటికీ, మోక్షజ్ఞ తొలి చిత్రం, మహాకాళి మరియు జై హనుమాన్ వంటి మూడు ప్రాజెక్టుల స్క్రిప్ట్స్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. 

దీనిని బట్టి ప్రభాస్ తో ఆయన చేయనున్న మూవీ సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలానే సమయం అయితే పట్టేలా కనపడుతోంది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్, హను రాఘవపూడి మూవీతో పాటు స్పిరిట్ వరుసగా ఒక్కొక్కటిగా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

Dragon Director Requested Mahesh Babu

0

Pradeep Ranganathan’s latest blockbuster, Dragon, is having a good run at the box office. Starring Anupama Parameswaran and Kayadu Lohar as heroines, the movie was dubbed into Telugu with the title Return of The Dragon. Ashwath Marimuthu, the director of the film, requested Mahesh Babu watch the film.

Ashwath Marimuthu directed ‘Ori Devuda,’ a remake of his first Tamil film, Oh My Kadavule. February 21 marked the release of ‘Return of the Dragon’ to Telugu audiences. In Telugu states, Mythri Movie Makers released it.  The Mythri team held a success meet after the film surpassed Rs 100 crore globally. During the press meet, Ashwath Marimuthu requested Mahesh Babu to watch the film.

It is a known fact that superstar Mahesh Babu immediately posts a review on social media after watching any film. Even if it’s a small film or a big film, he shares his opinion on X (Twitter) if he likes a film, be it in any language.

‘Oh My Kadavule’ features Ashok Selvan and Ritika Singh, directed by Ashwath Marimuthu. Mahesh saw the movie during COVID. He praised the film’s team, and the film quickly trended on social media. Many people Googled it and viewed it frequently. Ashwath got the opportunity to direct the Telugu version of ‘Ori Devuda.’. Ashwath now urges Mahesh to check out his movie ‘Dragon’ as well.

Meanwhile, Dragon had an extraordinary 2nd weekend at the box office, as it crossed the 100 Cr mark globally, and in Telugu states, the film also collected around 15 Cr gross, and it is a sensational blockbuster. Still, Pradeep Ranganathan’s Dragon is the No. 1 choice for Tamil and Telugu audiences.