Home Blog Page 588

Chhaava Now Streaming in Telugu

0

Vicky Kaushal’s Chhaava arrived on Netflix a day ago, and it disappointed the Telugu viewers as it was not available in their language. After public demand, Chhaava is now made available for streaming in Telugu.

After Hindi audiences, it is the Telugu movie fans who loved the film the most. Upon its theatrical release, many Telugu people watched the film in the Hindi version.

Chhaava loved by Telugu and Hindi audiences

Later, with the demand of Telugu version getting increased, the film was released in theaters and achieved big success despite a delayed release.

Chhaava is now available in Telugu on Netflix

Yesterday the film made its debut on Netflix, but it disappointed Telugu and south audiences as it streamed only in Hindi. Now, the happy news for Telugu audiences is Vicky Kaushal’s Chhaava is now made available for streaming in Telugu.

Apart from Telugu, the historical biopic is available in other languages like Tamil, Malayalam, and Kannada.

Chhaava may create viewership records on Netflix because of the massive anticipation among the viewers. The interest from Telugu viewers will enhance the film’s appeal across India.

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్ ?

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా విశ్వంభర. ఈ మూవీపై మెగా ఫాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల విశ్వంభర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందర్నీ ఆకట్టుకోగా అందులోని విజువల్ ఎఫెక్ట్స్ పై మాత్రం విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక నేడు ఈ మూవీ నుంచి రామ రామ అనే పల్లవి తో సాగే సాంగ్ ని హనుమాన్ జయంతి సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తప్పకుండా ఈ పాట అందర్నీ ఆకట్టుకుని రేపు థియేటర్స్ లో కూడా అలరిస్తుందని చెప్తుంది యూనిట్. 

ఇక ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి జులై 24న గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే విశ్వంభర నుండి ఒక్కొక్కటిగా మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో భీమవరం దొరబాబు అనే మాస్ ఎంటర్టైనింగ్ పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ స్థాయి విజయవంతం చూడాలి

ఆ రెండు సినిమాల రిలీజ్ లతో రిస్క్ చేస్తున్న మైత్రి సంస్థ 

0

తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం పలువురు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మరియు కోలీవుడ్ అగ్ర నటులతో వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. మరోవైపు తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రెండు సినిమాలు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ ఎర్నేని. 

యువ దర్శకుడు వెంకట సతీష్ కిలారు నిర్మాతగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ పెద్ది. ఈ మూవీలో రాంచరణ్ మాస్ పాత్రలో కనిపిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీనిని సుకుమార్ రైటింగ్స్, వ్రిద్ది సినిమాస్ తో కలిసి మైత్రి మూవీ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇక ఈ మూవీని 2026 మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. 

మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కేజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ మాస్ యాక్షన్ నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ యొక్క షూట్లో జాయిన్ అవ్వనున్నారు. ఈ మూవీని కూడా వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిలిపేందుకు సిద్ధమైందట మైత్రి మూవీ మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 9న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకు రానుందని తెలుస్తోంది. 

ఒకరకంగా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తో కేవలం రెండు వారాల గ్యాప్ లోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ చేస్తోందని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే పక్కాగా ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అఫీషియల్ డేట్ వచ్చేవరకు వెయిట్ చేయాలి మరి. అదే గనక నిజమై ఏప్రిల్ 9న ఎన్టీఆర్ మూవీ వస్తే అటు చరణ్ మూవీ ఇటు ఎన్టీఆర్ మూవీ ఏ స్థాయిలో విజయవంతం అవుతాయో, అలానే ఈ రెండిటికీ థియేటర్స్ యొక్క కేటాయింపులు ఎలా ఉంటాయో చూడాలి. 

‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్

0

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు హీరోగా తాజాగా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ విజువల్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్  పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో పాటు పలు ఇతర భాషల నటీనటులు క్యామియో పాత్రల్లో కనిపించనున్నారు. 

ఇక ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తుండగా కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ సినిమాస్ సంస్థలపై మంచు విష్ణు గ్రాండ్ గా భారీ స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని భావించారు. 

అయితే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సినిమాకు సంబంధించి మరికొన్ని పనులు పెండింగ్ ఉండటంతో దీనిని మరొక రెండు నెలలు వాయిదా వేసి జూన్ 27 గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్టు తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన కన్నప్ప మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి. 

‘ఛావా’ ఓటిటి : డిజప్పాయింట్ అయిన సౌత్ ఆడియన్స్

0

బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తరికెక్కిన తాజా హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ఛావా. చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. 

శివాజీ మరణానంతరం ఆయన రాజ్యాన్ని ఆక్రమించేందుకు ఔరంగజేబు ప్రయత్నించటం అదే సమయంలో శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ అడ్డగించడం అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ పర్ఫామెన్స్ కి అందరి నుంచి విశేషమైన క్రేజ్ లభించింది. 

తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేయగా ఇక్కడ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అయితే ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా సౌత్ ఆడియన్స్ ని పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. 

దానికి కారణం ప్రస్తుతం ఈ సినిమా ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండడం. ఇక ఇతర సౌత్ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఆడియన్స్ వారు ఛావా యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కోసం చూస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడూ ఇతర భాషల్లో అందుబాటులోకి వస్తుందో చూడాలి. 

క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్న సాయి అభ్యంకర్

0

ప్రస్తుతం కోలీవుడ్లో యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్ పేరు మారుమ్రోగుతోంది. గాయకులు టిప్పు, హరిణిల కుమారుడైన సాయి, కెరీర్ పరంగా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోస్ కంపోజ్ చేసి వారితో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అతడు వరుసగా అవకాశాలతో కొనసాగుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్, అట్లీ కలిసి పని చేయనున్న గ్రాండ్ విజువల్ వండర్ మూవీకి ఆయనే సంగీత దర్శకత్వం వహించనున్నారు. 

అఫీషియల్ గా ప్రకటన చేయనప్పటికీ అభ్యంకర్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవాన్ని ఈ సినిమాకి మొదట అనిరుద్ ని తీసుకుందాం అని భావించినప్పటికీ ఆయన ఫుల్ గా బిజీగా ఉండటంతో ఆయన స్థానంలోకి సాయి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక అతడి ఖాతాలో మరికొన్ని సినిమాలు కూడా ప్రస్తుతం చేరాయి. అవి సూర్యా 45వ మూవీ, దీనిని ఆర్జే బాలాజీ తెరకెక్కించుకున్నారు. అలానే ప్రదీప్ రంగనాథన్ తదుపరి కెరీర్ నాలుగో సినిమా కూడా చేయనున్నారు సాయి అభ్యంకర్. 

వీటితోపాటు రాఘవ లారెన్స్ హీరోగా రూపొందుతోన్న బెంజితో పాటు శింబు త్వరలో నటించనున్న సినిమా కూడా సాయినే మ్యూజిక్ అందించనున్నారు. మొత్తంగా ఈ విధంగా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న సాయి అభ్యంకర్, ఈ సినిమాలతో ఏ స్థాయిలో విజయాలు, పేరు అందుకుంటారో చూడాలి. కాగా ఇప్పటివరకు కేవలం మ్యూజికల్ ఆల్బమ్స్ తో అందరినీ ఆకట్టుకున్న సాయి ఒక్కసారిగా ఇన్ని వరుస క్రేజీ ఆఫర్స్ అందుకోవడం నిజంగా పెద్ద విశేషం అంటున్నాయి సినిమా వర్గాలు.

 ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బాక్సాఫీస్ కలెక్షన్స్

0

అజిత్ హీరోగా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన తన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించగా దీనిని తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్ లో భారీ వ్యయంతో నిర్మించారు. 

అజిత్ మాస్ యాక్టింగ్ తో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఎలివేషన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓవరాల్ గా మొదటి రోజు మంచి టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమా తమిళనాడులో ఓపెనింగ్ రోజున రూ. 30 కోట్లు అలానే ఆలిండియా పరంగా రూ. 35 కోట్లు సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో రెండు మిలియన్లు సంపాదించింది. 

ఈ విధంగా టోటల్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ పరంగా ఈ సినిమా రూ. 52 నుంచి రూ. 53 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. నిజానికి ప్రమోషనల్ కార్యక్రమాలు మరింత బాగా చేసి ఉంటే గుడ్ బ్యాడ్ అగ్లీ మరింత గ్రాండ్ గా ఓపెనింగ్స్ అందుకునేది. ఈ సినిమా అటు తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో కూడా బాగానే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. 

అజిత్ ఫ్యాన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్న ఈ సినిమాకి సాధారణ ఫ్యాన్స్ నుంచి మాత్రం యావరేజ్ టాక్ అయితే లభిస్తోంది. మరి ఈ వీకెండ్ లో ఈ సినిమా ఎంత మేర రాబడుతుందో ఓవరాల్ గా ఏ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి

‘హరి హర వీర మల్లు’ : నిర్మాతకు అది దురదృష్టం

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగం మే 9న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ఈ మూవీని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర వర్క్స్ వేగంగా పూర్తి చేస్తోంది టీమ్. 

అయితే తన పార్ట్ బ్యాలెన్స్ షూటింగ్ ని పూర్తి చేసేందుకు ఇటీవల డేట్స్ కేటాయించారు పవన్. కాగా రెండు రోజుల క్రితం పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ అగ్ని ప్రమాదం సంభవించడంతో మెగా ఫామిలీ మొత్తం కలత చెందింది. కాగా ఈ సమయంలో తన భాగం సినిమాకు సంబంధించి షూటింగ్లో పవన్ పాల్గొంటారో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానితో ఒకింత నిర్మాత రత్నంకి దురదృష్టకర పరిస్థితి అని చెప్పాలి. 

దీనిని బట్టి పక్కాగా మే 9 రిలీజ్ హరిహర వీరమల్లు ఎంతవరకు ఆడియన్స్ ముందుకు వస్తుందనేది కొంత సందేహమే. మరోవైపు ఈ సినిమా యొక్క ఓటిటి హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వారు సినిమా యొక్క పోస్ట్ పోన్మెంట్ నిమిత్తం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. మరి హరహర వీరమల్లు ఎంతవరకు అనుకున్న డైట్ కి రిలీజ్ అవుతుందో చూడాలి. 

భారతీయ సినిమా ఆఫర్స్ తో బిజీగా ప్రియాంక చోప్రా

0

భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలు అయితే చేయటం లేదు. ఇటీవల అక్కడక్కడ హాలీవుడ్ సినిమాలు చేశారు ప్రియాంక. 

ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుకుతున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 లో ఆమె ఒక కీలక పాత్ర చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. 

అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా అనంతరం ప్రియాంక వరుసగా పలు భారతీయ సినిమా అవకాశాలు అందుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హృతిక్ హీరోగా రూపొందనున్న క్రిష్ 4 సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించనుండగా తాజాగా అనౌన్స్ అయిన అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ నటించే అవకాశం ఉంది. 

అలానే ఆమె చేతిలో మరొక రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయట. ఆ విధంగా ప్రస్తుతం వరుసగా ఇండియన్ సినిమా అవకాశాలతో కొనసాగుతున్నారు ప్రియాంక చోప్రా. మరి ఈ సినిమాలు ఆమెకు ఎంత మేర విజయాలు అందిస్తాయో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి. 

Good Bad Ugly Day 2 Box Office Collections

0

After a good start at the box office, Ajith’s latest action comedy, Good Bad Ugly, shows good consistency at the box office on day 2. The film aims for a huge weekend now. Good Bad Ugly Day 2 Box Office Collections are out now.

Good Bad Ugly Holds Well On Day 2

Directed by Adhik Ravichandran, Good Bad Ugly, on its opening day, collected 53 Cr gross worldwide, the biggest start for Ajith. In Tamil Nadu, the film opened with a 30 Cr+ gross, and on day 2, the film held well despite being a weekday.

Good Bad Ugly 2 Days WW Gross Goes Past 80 Crore

The day 2 estimates are around 17 Cr in Tamil Nadu, which takes the total Tamil Nadu gross to 47-48 Cr for 2 days. Ajith’s Good Bad Ugly Day 2 Box Office Collections are out now, and the worldwide gross for 2 days will be 80 Cr+.

The film is expected to take a big jump tomorrow, and the advances are also higher than the opening day. GBU now aims for huge numbers in the next 3 days, as Saturday, Sunday form the regular weekend, and Monday is the Tamil New Year holiday.

Ajith’s Good Bad Ugly aims at a huge weekend at the Box Office

In Tamil Nadu, the film is expected to touch 100 Cr gross within this 5-day extended weekend. The film also aims for higher numbers in regional markets along with overseas this weekend.