Home Blog Page 508

‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

0

వెర్సటైల్ యాక్టర్ ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున క్రేజీ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కుబేర. ఈమూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే కుబేర నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఆకట్టుకునే కథ, కథనాలతో శేఖర్ కమ్ముల తీస్తున్న ఈమూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందిన ఈమూవీ జూన్ 20న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే విషయం ఏమిటంటే, రేపు జరగాల్సిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు మూవీ మేకర్స్.

నేడు అహ్మదాబాద్ లో విమానం కూలిన ఘటనలో అనేకమంది మృతి చెందడంతో అందుకు సంతాపంగా దానిని వాయిదా వేశారు. కాగా ఈవెంట్ ఆదివారం జరుగనుందా ప్రత్యేకంగా ధనుష్ కూడా హాజరు కానున్నారట. మొత్తంగా ఈ క్రేజీ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

‘కన్నప్ప’ కి ప్లస్ కానున్న ప్రభాస్ క్రేజ్

0

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ వంటి నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా సాంగ్స్, టీజర్ తో అందరిని ఆకట్టుకున్న కన్నప్ప నుంచి జూన్ 13న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి రెడీ అయింది టీమ్. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ క్రేజ్ మూవీ యొక్క ప్రమోషన్స్ కి ఎంతో హెల్ప్ అయ్యేలా ఉంది.

ముఖ్యంగా ఈ సినిమాని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ఏరియాస్ లో మైత్రి మూవీస్ వారు మంచి ధరకు కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. కాగా ఈ మూవీ ఆ ప్రాంతాల్లో అడ్వాన్స్ బేసిస్ లో రిలీజ్ కానుంది. ఓవరాల్ గా చూసుకుంటే కన్నప్ప బిజినెస్ పరంగా ప్రభాస్ ఫ్యాక్టర్ బాగానే పనిచేస్తుంది.

మరోవైపు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అనంతరం సినిమాపై అంచనాలు భారీగా పెరగటం ఖాయమని తప్పకుండా త మూవీ అందర్నీ ఆకట్టుకుంటుందని తాజాగా ప్రమోషన్ ఈవెంట్స్ లో భాగంగా హీరో మంచు విష్ణు తెలిపారు. జూన్ 27న కన్నప్ప పలు భాషల ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘అఖండ – 2’ : ఆ అంశం ఓవర్ లోడ్ అయింది

0

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తరుకెక్కుతున్న తాజా మాస్ యాక్షన్ సినిమా అఖండ 2. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా యువనటుడు ఆది పినిశెట్టి విలన్ పాత్ర చేస్తున్నారు.

ఇప్పటికే అందర్లో భారీ అంచనాలు ఏర్పరచిన ఈ సినిమా నుంచి తాజాగా బాలకృష్ణ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో బాలకృష్ణ మార్క్ యాక్షన్, డైలాగ్స్ తోపాటు బోయపాటి మార్క్ ఎలివేషన్స్, భారీ ఫైట్స్ వంటివి ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు అఖండ 2 మూవీపై ఉన్న అంచనాలను టీజర్ మరింతగా పెంచింది.

అయితే విషయం ఏమిటంటే టీజర్ లో సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో లౌడ్ గా ఉందని పలువురు ప్రేక్షకాభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆఖండ 1 కి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి స్పందన వచ్చింది.

అయితే టీజర్ లో ఆ స్థాయి రెస్పాన్స్ మాత్రం లభించకపోవడంతో ఓవరాల్ గా మూవీలో ఎంతమేర బీజీఎంతో అతడు అదరగొడతాడు అనేది అందరిలో ఆసక్తికరమైన చర్చకి దారితీస్తోంది. మరి సెప్టెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానున్న అఖండ 2 ఎంతమేర విజయం అందుకుంటుందో తమన్ ఏ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరిస్తారో చూడాలి.

‘తుడరుమ్’ ఓవరాల్ కలెక్షన్స్ : బిగ్ బ్లాక్ బస్టర్

0

మలయాళ స్టార్ నటుడు మోహన్లాల్ హీరోగా శోభన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తుడరుమ్. ఈ సినిమా ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని భారీ కలెక్షన్ ని అందుకుంది.

అంతకు ముందు పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఎంపురాన్ మూవీతో పెద్ద విజయం అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు మోహన్ లాల్.

ఇక తాజాగా తుడరుమ్ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆయన ఖాతాలో మరొక విజయం నమోదయింది. యువ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 230 కోట్లు కొల్లగొట్టి అటు కేరళలో రూ. 119 కోట్ల గ్రాస్ ని అనగా రూ. 50 కోట్ల షేర్ ని అందుకున్న తొలి మూవీగా నిలిచింది.

మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమా 11 మిలియన్ల డాలర్లు అనగా రూ. 93. 5 కోట్ల కలెక్షన్ అందుకొని సెన్సేషనల్ గా దూసుకెళ్లింది. ఆ విధంగా ఓవరాల్ గా మలయాళ సినిమా చరిత్రలో మంజుమ్మేల్ బాయ్స్, ఎంపురాన్ మూవీస్ అనంతరం అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా తుడరుమ్ బ్లాక్ బస్టర్ రికార్డుని నమోదు చేసింది.

‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ రావాల్సిందే

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు పార్ట్ వన్. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.

అయితే విషయం ఏమిటంటే ఇప్పటికే హరిహర వీరమల్ల నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే అందుకోలేకపోయాయి. మరోవైపు ఈ మూవీ యొక్క థియేటర్ ట్రైలర్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

బిజినెస్ పరంగా కూడా హరిహర వీరమల్లు ప్రస్తుతం హోల్డ్ లో ఉండటంతో ఓవరాల్ గా ట్రైలర్ రిలీజ్ అనంతరం అంచనాలు మరింతగా పెరగటం ఖాయమని అంటున్నారు. ఒక సినిమాకి ట్రైలర్ అనేది ఎంతో ముఖ్యం అనేది తెలిసిందే. అయితే పక్కాగా ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై క్లారిటీ రావాలి.

మరోవైపు అతి త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ని కూడా టీం అనౌన్స్ చేయనుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎప్పటి నుంచొ ఎదురుచూస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం హరిహర వీరమల్లు ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.

The Raja Saab Teaser in select theaters

0

Tollywood Actor Prabhas and Director Maruthi’s much awaited flick, The Raja Saab is set for the release of its Teaser. Fans and Audience have been waiting eagerly for this. The Teaser has been postponed for various reasons and will now finally make it on YouTube. However, it will also have the release in few select theaters across the Telugu States.

The Teaser will be released in a few theaters on 16th June as confirmed by Tollywood Producer SKN. The list of these theaters will also be out soon. The shoot of The Raja Saab is also progressing at a rapid pace, and it has been rumoured that Bollywood Actress Sunny Deol will play a pivotal role in the film.

Prabhas and Maruthi look to score a big blockbuster with The Raja Saab. The team also seems to be confident about the film. The Raja Saab’s release date was also confirmed recently as December 5th this year. This will be an ideal release period with a solo advantage.

Rentrak in Telangana?

0

Tollywood Producer Dil Raju made a few interesting statements in his speech during the Trailer launch event of Thammudu. Thammudu is the latest film of Actor Nithiin directed by Venu Sri Ram. The film also stars Sapthami Gowda and Laya in pivotal roles. Dil Raju said that he had instructed the PR team not to opt paid views on YouTube as this could kill the real reach of the film’s content.

He also added that there was a need to stop boasting about the fake box office numbers and YouTube records. He also opined that there should be a tracking system on the likes of Rentrak in Telangana so that there will be original collections and figures. Rentrak is a global media measurement and research company serving the entertainment industry.

This is indeed a welcoming gesture from the Producer. However, we need to see if this gets on track, as Actors and Producers must fall in line to encourage such a system. Boasting box office numbers became a usual ritual for all the Actors and makers. So, expecting such a system in Tollywood or the Indian Film Industry will be a distant dream.

Trivikram Denies Ram Charan Project

0

The inside reports in the Telugu film industry regarding the upcoming projects of Trivikram Srinivas are being spread across social media. The names of Venkatesh, Ram Charan, and NTR came in the news, and the latest news is Trivikram will not work on the Ram Charan project at this moment.

Trivikram – Ram Charan’s Project will not start as of now

Producer Naga Vamsi, who is the close aide of Trivikram, took to his social media and confirmed that only films with Venkatesh and NTR have been confirmed with the star writer-director, and the rest of the news is mere speculation.

But as per the industry circles inside reports, certainly, there will be a film in combination of Charan and Trivir. However, right now, the Rangasthalam actor is busy with Peddi, and his next is confirmed with Sukumar.

Charan – Trivikram Project on hold at the moment, while the fans eagerly await NTR – Trivikram’s Film to start

It is widely known that director Sukumar always takes as much time as possible on a film’s set. So. Trivikram will not work on the Ram Charan project right now, but it is most likely to be announced after RC 17.

That makes clear that as of now, Trivikram has only two confirmed projects in his hands: one is with Venkatesh, and the second one is with NTR. While Venkatesh’s film will immediately go on floors, all eyes are eager to see when NTR’s film will go on floors.

Parichayamila – A Beautiful Song from 8 Vasanthalu

0

The upcoming emotional love saga, ‘8 Vasanthalu,’ directed by Phanindra Narsetti and produced by pan-India production house Mythri Movie Makers, ticks all the right boxes as it is successful in creating buzz. Parichayamila, the second single of 8 Vasanthalu, is a beautiful song.

Featuring Ananthika Sanilkumar in the lead alongside Hanu Reddy and Ravitheja Duggirala, the film’s promotional content is impressive. The first single, ‘Andhama Andhama,’ received a good response.

Parichayamila Lyrical Video from 8 Vasanthalu

Now the makers have released another song. Parichayamila, the second single of 8 Vasanthalu, is a beautiful song. Without any doubt, it can be said to be the best song in recent times.

The music, visuals, lyrics, and the legendary Chitra ma’am’s voice all come together perfectly to make this magical track a must-listen.

Hi, Nanna Fame. Hesham Abdul Wahab has composed this beautiful melody, lyricist Vanamali has penned it, while veteran singer K.S. Chithra lends her magical voice, taking the song to new heights.

ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కలెక్షన్ క్రాష్ అయిన ‘థగ్ లైఫ్’

0

కమలహాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల అనంతరం కమలహాసన్ తో కలిసి మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

నాజర్, తనికెళ్ళ భరణి, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు చేసిన ఈమూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. అయితే ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం చాలా ఏరియాల్లో డిజాస్టర్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

ఇప్పటివరకు కేవలం రూ.80 కోట్ల గ్రాస్ వద్ద మాత్రమే నిలిచిన తగ్ లైఫ్ మూవీ అటు తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయట్లేదు.

మొత్తంగా తమిళనాడులో ఐదు రోజుల్లో ఈ మూవీ రు. 35 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఈ సినిమా నెగిటివ్ టాక్ తో దారుణంగా రన్ అవుతుంది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా అనేక ఏరియాల్లో థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్ కలెక్షన్లతో కమల్ కెరీర్ లో మరొక భారీ పరాజయం దిశగా కొనసాగుతుంది.