Home Blog Page 495

‘హరి హర వీర మల్లు’ : ఆ విషయమై ఇంకా సందిగ్ధమే

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గిస్ ఫక్రి, నోరా పతేహి, అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు.

ఇప్పటికే సాంగ్స్, గ్లింప్స్ టీజర్స్ తో మంచి ఇంట్రెస్ట్ ఏర్పరచిన ఈ సినిమా వాస్తవానికి ఈపాటికి రిలీజ్ కావాల్సింది. అయితే సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పలు ప్రీ బిజినెస్ వర్క్ పెండింగ్ కారణంగా సినిమా కొన్నాళ్లపాటు వాయిదా పడి ఫైనల్ గా న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమాని వచ్చే నెల 24న గ్రాండ్ లెవెల్ లో పలు భాషల్లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు టీం అఫీషియల్ గా అయితే పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఈ మూవీ అనేకమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

నిజానికి ఈ డేట్ అయినా ఫిక్సేనా  లేక మళ్ళీ సినిమా వాయిదా పడుతుందా అనే అనుమానం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో నెలకొంది. ఇందులో గజదొంగ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన హరి హర వీర మల్లు రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో చూడాలి. 

‘జన నాయాగన్’ ఫస్ట్ గ్లింప్స్ : అనిరుద్ పై విమర్శలు

0

దళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా జన నాయగన్. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పై ఎంతో భారీ ఎత్తున నిర్మితమవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమిత బైజు కీలకపాత్రలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా తెలుగు సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అనేటువంటి వార్తలు కూడా కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు విజయ బర్త్ డే సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది టీం.

ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ టీజర్ లో అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై నెగిటివ్ విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా అనిరుద్ నుంచి ఎంతో ఆశించిన విజయ్ ఫ్యాన్స్ ఏమాత్రం బిజిఎం బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయ్ కెరీర్ ఆఖరి సినిమా కావటంతో ఫ్యాన్స్ దీని కోసం ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

జన నాయగన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ మూవీ ఎంతమేర సక్సెస్ అందుకుని ఏస్థాయి కలెక్షన్ సాధిస్తుందో తెలియాలి అంటే మరొక ఆరు నెలలు ఆగాల్సిందే.

ధనుష్ కి నేషనల్ అవార్డు ఖాయం : మెగాస్టార్

0

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ల కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా సినిమా కుబేర. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. దానితో ప్రేక్షకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు నేడు గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది కుబేర టీం.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమీగోస్ క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా దీనిని నిర్మించాయి. ఇక నేటి సక్సెస్ మీట్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు.

ఆయన మాట్లాడుతూ కుబేర సినిమాలో నటీనటుల కంటే ఆయా పాత్రలే సినిమా మొత్తం కనిపించాయని, అధ్యంతం ఆకట్టుకునే రీతిన మూవీని తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్. 

అలానే ఈ సినిమాలో దేవా పాత్రలో నటించిన ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఇప్పటికే పలు నేషనల్ అవార్డులు తన ఖాతాలో వేసుకున్న ధనుష్ ఈ సినిమాతో మరొకసారి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకోవటం ఖాయమని ముందస్తుగా తనకు విజయాభినందనలు తెలియజేశారు మెగాస్టార్. నాగార్జున, రష్మిక మందన్న తోపాటు టీం మొత్తం కూడా అద్భుతంగా పెర్ఫాన్ చేశారని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. 

మెగాస్టార్ – అనిల్ రావిపూడి నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మెగాస్టార్ కుమార్తె సుస్మిత తో కలిసి సాహూ గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని వేగంగా జరుపుకున్న ఈ సినిమాకు తదుపరి షెడ్యూల్ రేపు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మెగాస్టార్, నయనతార తో పాటు వెంకటేష్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

ఇందులో ఆయన క్యామియో పాత్ర ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇటీవల సంక్రాంతి వస్తున్నాం సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మూవీతో కూడా మరొక సంచలన విజయం తన ఖాతాలో వేసుకోవటం ఖాయమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

ఇక ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. మరి అందరిలో మంచి బజ్ ఏర్పరిచిన ఈ క్రేజీ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 

‘కుబేర’  డే 2 ఏరియా వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

0

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కలిసి చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కుబేర. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

శేఖర్ కమ్ముల తీసిన ఈమూవీకి నికేత్ బొమ్మిరెడ్డి ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేసారు. అయితే మొదటి నుండి అందరిలో మంచి క్రేజే ఏర్పరిచిన కుబేర మూవీ రెండు రోజుల క్రితం ఆడియన్స్ ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని ప్రస్తుతం చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

తమ మూవీకి మంచి రెస్పాన్స్ అందిస్తున్న ఆడియన్స్ కి నిన్న ప్రత్యేకంగా థాంక్స్ మీట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన యూనిట్ నేడు సక్సెస్ మీట్ ద్వారా మరొక్కసారి అందరికీ థాంక్స్ చెప్పింది. ఇక ఫస్ట్ డే బాగానే కలెక్షన్ రాబట్టిన కుబేర మూవీ యొక్క ఏరియా వైజ్ కలెక్షన్ డీటెయిల్స్ ని క్రింద లిస్ట్ లో చూద్దాం.

  • తెలంగాణ: రూ. 9.5 కోట్లు
  • ఆంధ్రప్రదేశ్: రూ. 12 కోట్లు
  • తమిళనాడు: రూ. 9.25 కోట్లు
  • కర్ణాటక: రూ. 3.7 కోట్లు
  • కేరళ: రూ. 0.55 కోట్లు
  • రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ. 1.2 కోట్లు
  • మొత్తం ఆల్ ఇండియా గ్రాస్—రూ. 36.2 కోట్లు
  • అమెరికా – రూ. 11.25 కోట్లు
  • రెస్ట్ ఆఫ్ వరల్డ్ –రూ. 7.5 కోట్లు
  • మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్రాస్—రూ. 55 కోట్లు
  • తెలుగు రాష్ట్రాల షేర్—రూ. 12 కోట్లు
  • ప్రపంచవ్యాప్తంగా షేర్—రూ. 27.5 కోట్లు
  • బ్రేక్ఈవెన్ షేర్: రూ. 65 కోట్లు
  • రికవరీ—42%

అయితే ఈ లిస్ట్ ని బట్టి చూస్తే రెండవ రోజు బాగా రాబట్టిన కుబేర, మూడవరోజు కూడా మంచి కలెక్షన్ దిశగా కొనసాగుతోంది. అయితే రేపు సోమవారం కావడంతో రేపటి నుండి ఈ మూవీ ఎంతమేర కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

‘దృశ్యం – 3’ అఫీషియల్ అనౌన్స్ మెంట్

0

మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ దృశ్యం సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మలయాళ సినిమాకి ఇటీవల సీక్వెల్ అయిన దృశ్యం 2 కూడా మరింత పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇక దీని అనంతరం రానున్న మూడో భాగం కోసం ఎప్పటినుంచో సినిమా లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దృశ్యం మూవీ తెలుగులో వెంకటేష్ హిందీ లో అజయ్ దేవగన్ చేయగా రెండు భాషల్లో కూడా విజయాలు అందుకున్నాయి.

పార్ట్ 1, పార్ట్ 2 అనంతరం పార్ట్-3 ని నిన్న అఫీషియల్ గా నిర్మాతలైన ఆశీర్వాద్ సినిమాస్ వారు అనౌన్స్ చేశారు. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రానున్న దృశ్యం 3, గతంలోని రెండు భాగాల కంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు దృశ్యం 3 ని ఇటీవల అజయ్ దేవగన్ హీరోగా హిందీలో అనౌన్స్ చేశారు. అయితే అది సరికొత్త కథనా లేకపోతే ఇదే కథతో తెరకెక్కిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఎప్పటికి పూర్తి అయి, ఎప్పుడు ఆడియన్స్ ముందుకి వస్తుంది అనే దాని పై మాత్రం క్లారిటీ రావాలి ఉంది.

నటులుగా మారుతున్న తమిళ దర్శకులు

0

ఇటీవల మనం తమిళ్ సినిమా పరిశ్రమలో గమనిస్తే పలువురు డైరెక్టర్స్ నటులుగా మారిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఏ మాయ చేసావే సినిమాతో మంచి పేరు సంపాదించిన గౌతమ్ మీనన్ ప్రస్తుతం అక్కడక్కడ పలు సినిమాల్లో నటుడిగా కూడా కనిపిస్తున్నారు. 

అలానే నాని, ఖుషి వంటి సినిమాలు తీసిన ఎస్ జె సూర్య కూడా తమిళ్, తెలుగు సినిమాల్లో నటుడిగా మంచి పేరుతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. అలానే మరొక దర్శకుడు మిస్కిన్ కూడా అక్కడక్కడ పలు సినిమాల్లో కీలకపాత్రలు చేసి ఆకట్టుకున్నారు.

అయితే విషయం ఏమిటంటే ఇప్పటికే శృతిహాసన్ తో కలిసి ఒక ప్రత్యేకమైన సాంగ్ లో కనిపించిన యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ త్వరలో అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.

లేటెస్ట్ కోలీవుడ్ న్యూస్ ప్రకారం అతి త్వరలో శింబు హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించునున్న వడా చెన్నై ఫ్రాంచైజ్ సిరీస్ మూవీలో డాక్టర్, జైలర్ మూవీస్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతిత్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

Kuberaa Sets Fire at Box Office – 1st Weekend in Detail

0

Sekhar Kammula’s Kuberaa had a terrific 1st weekend at the box office. The trade is awed by it as Kuberaa sets the box office on fire.

In all three days of opening weekend, the film has collected a double-digit gross in Telugu States, which is a sensational feat.

Kuberaa Superb Performance at the USA Box Office

In the USA alone the weekend collection is around 1.6M, and overseas gross exceeds 2.5M. The movie does good numbers in Karnataka as well.

As far as Tamil Nadu is concerned, the film had a decent week and Sunday is the best day for the film, which is a positive sign.

Sekhar Kammula’s Kuberaa sets the box office on fire, but Kerala’s numbers are disappointing, and the Hindi version also did not add any collections.

Kuberaa on fire mode at the Box Office

Overall, the film had a superb 1st weekend in theaters with around 80 Cr gross collection worldwide.

The Telugu version recovered 2/3 of theatrical rights, whereas in Tamil Nadu the film recovered only 40% for the weekend.

So to achieve breakeven, a strong weekday hold is needed in Tamil Nadu for the film, while in Telugu territories a decent hold will be good.

Mamitha Baiju to Romance Premalu Supporting Actor

0

Malayalam movie Premalu’s success made Mamitha Baiju a star across South India. Now, Mamitha Baiju will romance Premalu supporting actor Sangeeth Pratap.

Sangeeth Pratap’s performance as the hero’s friend in received superb response, and he is one of the main reasons for the movie’s success. 

On a surprising note, he pairs with Mamitha in a rom-com film. The fans are excited as Mamitha Baiju is all set to romance Premalu supporting actor Sangeeth Pratap.

Mamitha Baiju paired with Sangeeth Pratap in an upcoming romantic comedy

The makers announced the film on the occasion of Mamitha’s Birthday. This pairing sparks an interesting discussion as Premalu 2 being shelved recently. Sangeeth appears as Amal Davis in Premalu, the character which entertained in audiences.

Actor-writer Dinoy Paulose makes his directorial debut with this film after co-writing ‘Thanneer Mathan Dinangal’. Meanwhile, Sangeeth will be next seen in Mohanlal-Sathyan Anthikad’s Hridayapoorvam alongside Mohanlal.

Meanwhile, Mamitha secured major roles in top South Indian films. She stars in Vijay’s Jana Nayagan and Suriya’s upcoming movie, directed by Venky Atluri.

Kuberaa 2-Day Box Office: Area Wise Collections

0

Telugu cinema has finally seen a good hit film that is bringing audiences to the theaters with Sekhar Kammula’s Kuberaa. Starring Dhanush and Nagarjuna in main roles, Kuberaa 2-Day Box Office Area-Wise Collections are out now.

Kuberaa maintains a super strong hold on Day 2—Area Wise 2-Day Collections are here:

  • Telangana: 9.5 Cr
  • Andhra Pradesh: 12 Cr
  • Tamil Nadu: 9.25 Cr
  • Karnataka: 3.7 Cr
  • Kerala: 0.55 Cr
  • ROI: 1.2 Cr
  • Total All India Gross—36.2 Cr
  • America – 11.25 Cr
  • ROW – 7.5 Cr
  • Total Worldwide Gross—55 Cr
  • Telugu States Share—12 Cr
  • Worldwide Share—27.5 Cr
  • Breakeven Share: 65 Cr
  • Recovery—42%

Sekhar Kammula’s Kuberaa’s 2-Day Box Office Area-Wise Collections are excellent and consistent. The third day, which is today, will also gather good numbers, and after that we have to wait and see how the film will hold in the weekdays.