Home Blog Page 1937

NTR30 స్క్రిప్ట్ ఆల్రెడీ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిందా?

0

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కొరటాల కాంబినేషన్లో ఎప్పటి నుంచో ఒక సినిమా అనుకుంటున్నప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం కొత్త పుకారు ఏమిటంటే, ఎన్టీఆర్ (ఎన్టీఆర్ 30) తో దర్శకుడు కొరటాల శివ చేయబోయే సినిమా స్క్రిప్ట్ JR ఎన్టీఆర్ వద్దకు రాకముందే చరణ్ దానిని తిరస్కరించారట.

చరణ్ – కొరటాల కాంబో క్యాన్సిల్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొరటాల తన సినీ అరంగేట్రం నుండి చరణ్‌కి స్క్రిప్ట్‌లు చెబుతూనే ఉన్నారు. మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బండ్ల గణేష్ ప్రొడక్షన్‌లో చరణ్‌తో కొరటాల కలిసి పనిచేయాల్సి ఉండింది. అయితే ఆ కథ చరణ్‌కి అంతగా నచ్చకపోవడంతో ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లలేదు.

తరువాత, వారిద్దరూ కలిసి మళ్ళీ పని చేద్దాం అనే తరుణం వచ్చినప్పుడు, RRR సినిమా వారిద్దరికీ అడ్డుగా నిలిచింది. దాంతో చిరంజీవి రంగంలోకి దిగి కొరటాలతో సినిమా చేశారు. ఆ సినిమానే ఆచార్య. ఆ చిత్రం బాక్సాఫీస్ వైఫల్యం గూర్చి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక అలాంటి దారుణమైన పరాజయం తర్వాత రామ్ చరణ్ మరియు కొరటాల మధ్య గ్యాప్‌ మరింత పెరిగింది.

ముందుగానే చెప్పుకున్నట్లు తాజాగా వినిపిస్తున్న పుకార్లు నమ్మితే, ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ వాస్తవానికి చరణ్‌కు వివరించబడిందనే అంటున్నారు. కానీ ఆ స్క్రిప్ట్ చరణ్ ను పెద్దగా ఆకట్టుకోలేదట. ఆ తర్వాత అదే కథ అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్‌ల వద్దకు వెళ్లింది.

ఎన్టీఆర్ మరియు కొరటాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నందున, కొరటాల ఆ కథను ఎన్టీఆర్ కు వివరించారు. అయితే ఆచార్య ఫలితం తర్వాత ఈ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు జరిగాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్30 తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా ఎన్టీఆర్ 30వ సినిమాకి యువ తరంగం అనిరుధ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

NTR30 is previously cancelled project of Ram Charan and Koratala Siva ?

0

Mega Powerstar Ram Charan and Koratala combo never materialized though it has always been in cards. The new rumor is that the script of the untitled movie of NTR (NTR30) was actually rejected by Charan before it reached JR NTR.

This isn’t the first time Charan – Koratala combo got cancelled. Right from his debut, Koratala has been narrating scripts to Charan. After Mirchi, the ace director had to work with Charan under Bandla Ganesh production. But the movie didn’t go to sets as Charan didn’t like the full narration.

Later, when they both came together, RRR acted as barrier to both of them. So Chiranjeevi stepped in and did movie with Koratala. It was a box office failure that furthered the gap between the two.

Rumors if they are to be believed, NTR30 script was actually narrated to Charan but he was apparently not impressed. Hence, it went to Allu Arjun and JR NTR.

As NTR and Koratala have good rapport, director narrated it to him, but the script underwent lot of changes after Acharya’s result. Currently, the post-production is underway. Anirudh is scoring the music, Ratnavelu is the cinematographer for the untitled NTR30.

వారిసు ఫస్ట్ సింగిల్ కోసం తన పాటను తానే కాపీ కొట్టాడని థమన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం వారిసు (తెలుగులో వారసుడు). ఆన్లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లను షేక్ చేస్తూ తాజాగా విడుదలైన ఈ సినిమాలోని మొదటి పాట రంజితమే ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

థమన్ పాటలను కాపీ కొడతారని మరియు ఒకే తరహాలో ఆయన పాటలు ఉంటాయని తరచుగా విమర్శలు ఎదుర్కొంటారు. కానీ కొన్ని సార్లు ఈ ట్రోల్‌లు మరీ మితిమీరిన స్థాయిలో ఉంటాయి. కాగా కేవలం కొంత సారూప్యత ఉన్న దానిని కూడా కాపీ చేయబడిందని అతి చేస్తారు. ప్రతి సంగీత దర్శకుడికి ఒక నిర్దిష్ట శైలి ఉంటుంది.

కాబట్టి అయిన దానికి కాని దానికి ట్రోల్‌ చేయడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. పాటల్లో శైలిని పునరావృతం చేయడం విసుగు తెప్పిస్తుంది అనే మాట నిజమే కావచ్చు. కానీ ప్రతిసారీ థమన్ ను కాపీ అని ఎగతాళి చేయడం ఏమంత మంచిది కాదు.

వారిసు ఫ‌స్ట్ సింగిల్‌కి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. నెటిజన్లు రంజితమే పాటను తెలుగు సినిమా విన్నర్‌లోని నా బీసీ సెంటర్ లు పాటతో పోలుస్తున్నారు. రెండు పాటలకు బీట్‌లు ఒకేలా ఉండటం నిజమే, కానీ రెండు పాటలకు కూడా థమన్ ఏ సంగీతం అందించారు కాబట్టి ఈ పాటన కాపీ అని పిలవడంలో అర్థం లేదు.

పైన చెప్పినట్లుగా, రంజితమే ఇప్పటికే ఆడియో ప్లాట్‌ఫారమ్‌లలో టాప్‌ ట్రెండింగ్ తో సూపర్ హిట్ సాంగ్‌గా మారింది. ఇప్పుడు వారిసు రెండవ సింగిల్ కోసం ఒక బ్లాక్‌బస్టర్ వార్త గురించి ఊహాగానాలు వస్తున్నాయి.

వారిసు సెకండ్ సింగిల్‌ని అనిరుధ్ రవిచంద‌ర్ చేత పాడించ‌నున్నారట. అనిరుధ్ మరియు విజయ్ కాంబినేషన్‌లో పెద్ద హిట్ సినిమాలు మరియు ఆల్బమ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా మాస్టర్ కోసం అనిరుధ్ ఇచ్చిన స్టైలిష్ సౌండ్‌ట్రాక్‌కు ప్రేక్షకుల నుండి ఇప్పటికి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అంతే కాకుండా, ఇటీవల వచ్చిన బీస్ట్‌లోని హలమతి హబీబో పాట ఒక సంచలనం అనేది తెలిసిందే. ఆ పాటకు అనిరుధ్ స్వరకర్తతో పాటు గాయకుడు కూడా అవడం విశేషం.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారిసు చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్, థమన్ ల కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు, శిరీష్‌ల సహకారంతో వంశీ, హరి, ఆశిషోర్ సోలమన్‌లు ఈ చిత్ర కథను రాసారు. వారిసు చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు. మరియు ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత మరియు సంయుక్తతో సహా సమిష్టి తారాగణం ఈ చిత్రంలో కనిపించబోతుంది.

Thaman gets trolled for copying his own song for Vijay’s Varisu 1st lyrical song

0

Varisu is the new movie of Thalapathy Vijay. It’s first song Ranjithame has already become a hit, rocking the online music platforms. Thaman has scored music for this movie. Thaman is often criticized for copying songs and being monotonous.

But every so often the trolls get overboard and nitpick that mere similarity is copying. This is definitely bad since every music director has a specific style and that doesn’t mean copying. Repetition is of course boring, but making fun of him as copy is too much. Similar remarks came for Varisu first single.

Netizens are comparing Ranjithame song to Naa BC Center lu song from Telugu movie Winner. It is agreeable that the beats are same, but there’s no point in calling it as copy because both songs are scored by Thaman.

As said above, Ranjithame has already become a super hit song with trending top in Audio platforms, now there are speculations about a blockbuster reunion for the second single of Varisu.

If the rumors are to be believed, the second single of Varisu will be sung by Anirudh Ravichander. Anirudh and Vijay have big hit movies and albums in their combination. Especially the stylish soundtrack scored by Anirudh for Master is highly regarded from the audience. Moreover, Halamathi Habibo song from Beast was a sensation for which Anirudh was the composer and singer also.

Directed by Vamshi Paidipally, Varisu has S Thaman composing the music. This is the maiden collaboration of Vijay and Thaman.

Written by Vamshi, Hari and Ashishor Solomon, Varisu is backed by Dil Raju and Shirish under the Sri Venkateswara Creations banner. Varisu stars Rashmika Mandanna as the female lead and will have an ensemble star cast, including Prabhu, Sarath Kumar, Prakash Raj, Jayasudha, Srikanth, Shaam, Yogi Babu, Sangeetha and Samyuktha.

నిర్మాతల మండలి యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్న నిర్మాతలు

0

నియమాలు పాటించనప్పుడు వాటి వల్ల ఉపయోగం ఉండదు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అదే జరుగుతుంది. టాలీవుడ్ నిర్మాతలు 2022 ఆగస్టులో OTT ప్లాట్‌ఫారమ్‌లు థియేట్రికల్ వ్యాపారాన్ని చంపేస్తున్నాయని చెప్పడంతో పాటు వాటికి వ్యతిరేకంగా నిరసన కూడా వ్యక్తం చేశారు. దీంతో నిర్మాతల మండలిలో కొత్త నిబంధనలు వచ్చాయి.

నిర్మాతలు తమ సినిమా థియేటర్లలో విడుదల చేసిన 6 వారాల తరువాతే OTTలో విడుదల చేయాలనే నిబంధన వాటిలో ఒకటి. అయితే ఈ నిబంధన పదే పదే ఉల్లంఘించబడుతూ నిర్మాతల మండలిలో ఐక్యతను అపహాస్యం చేస్తోంది.

సినిమా పరిశ్రమ సాధారణంగా అసంఘటితమైనది. మరియు ప్రతి ఒక్కరూ అనుసరించే నియమాలను కలిగి ఉండటం కష్టం. ప్రతి సంఘంలో లేదా పరిశ్రమలో అనేక విభాగాలు ఉంటాయి. ఎవరికి వారు తమ అవసరాలు చూసుకుంటారు.

నిర్మాతలు తమ లాభాల గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప మరే విషయం వారికి పట్టదు. నిర్మాతకు లాభం చేకూర్చే విధంగా లేకుంటే ఏ నియమమైనా ఎక్కువ కాలం కొనసాగించలేకపోవడానికి కారణం ఇదే.

తెలుగు పరిశ్రమలో ఇటీవలి సినిమాలు.. నిర్మాతల మండలి సూచించిన 6 వారాల నిబంధన కంటే చాలా ముందుగానే విడుదల అవుతున్నాయి. స్వాతి ముత్యం మరియు ఓరి దేవుడా వంటి సినిమాలు OTTలో 3 వారాల్లోపే విడుదలయ్యాయి. మరింత విస్మయపరిచే విషయం ఏమిటంటే, స్వాతి ముత్యం దసరాకి థియేటర్లలో విడుదలైంది. మరియు దీపావళికి OTT స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేశాయి.

నిర్మాతల నుండి ఈ రకమైన బాధ్యతారహిత ప్రవర్తన తర్వాత ముందస్తు OTT విడుదలకు వ్యతిరేకంగా చేసిన సమ్మె మొత్తం వృధా అయింది, ఇకనైనా నిర్మాతలు వారు స్వయంగా విధించిన నియమాలను సమర్థవంతంగా అమలు చేస్తారని ఆశిద్దాం. నిబంధనలను ఉల్లంఘించిన వారు పర్యవసానాలను ఎదుర్కోనేలా చర్యలు తీసుకోవాలి. అలా జరగకపోతే భవిష్యత్తులో కూడా ఎవరూ వాటిని పాటించరు.

No one is following the Producer’s Council OTT rule in Tollywood

0

What is the use of rules when they are not followed? Tollywood producers protested in August 2022 against the OTT platforms by saying that they are killing the theatrical business. This led to new rules in producers council.

One of the rules says that Producers have to hold their movie releases on OTT for at least 6 weeks. This rule is getting flouted repeatedly, causing a mockery of the unity in Producers council.

Cinema industry is generally unorganized and having a set of rules followed by everyone is difficult. There are many divisions in the industry in every association. The only uniting factor is self-interest.

Producers are only concerned about their profits and nothing else. This is the reason any rule can’t sustain for long if it is not in the interest of Producer’s profit. The recent movies in Telugu industry are getting release way too earlier than the 6-week rule suggests.

Movies like Swathi Muthyam and Ori Devuda released on OTT within 3 weeks. What’s more shocking is Swathi Muthyam was released for Dussera in theaters and for Diwali, it was ready for OTT streaming.

The whole strike against the preemptive OTT release has gone waste after this kind of irresponsible behavior from the Producers, Hope there is an effective implementation of rules by them. Those who break rules have to face consequences, if not no one will follow them.

మరో మళయాళ రిమేక్ పై ఆసక్తి చూపుతున్న మెగాస్టార్ చిరంజీవి?

0

మెగాస్టార్ చిరంజీవి మరో మలయాళ సినిమాని రీమేక్‌ చేయనున్నారు అనే వార్త తాజాగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. గాడ్ ఫాదర్ సినిమా పరాజయం తర్వాత అభిమానులు మెగా ఫ్యామిలీ హీరోలు రీమేక్‌లు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే మెగా హీరోలు మాత్రం ఈ ఫీడ్‌బ్యాక్‌ని సీరియస్‌గా తీసుకోనట్లు కనిపిస్తుంది.

ఓటిటి విప్లవం తర్వాత అన్ని రకాల భాషల సినిమాలు ప్రేక్షకులకి చాలా సులువుగా అందుబాటులోకి వచ్చెసాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీమేక్ అనేవి ఎంత మాత్రం లాభాన్ని చేకూర్చే ప్రయత్నం కాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బ్రో డాడీ మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన హాస్యభరితమైన ఎంటర్‌టైనర్ మరియు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి. మోహన్ లాల్, పృథ్వీరాజ్ తండ్రీకొడుకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం బ్రో డాడీ. పృథ్వీరాజ్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడుగా కూడా వ్యవహరించారు. తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ తనయుడిగా మరో మెగా హీరో నటించే అవకాశం ఉందని సమాచారం.

తండ్రికి తెలియకుండా కొడుకు ఒక అమ్మాయితో సహజీవనం సాగించిన పరిస్థితుల్లో ఆ అమ్మాయి గర్భం దాల్చడం.. ఆ విషయంలో తండ్రి సలహా లేదా సహాయం ఆశించి వెళితే, తన తల్లి కూడా గర్భవతి అని బాంబు పెలుస్తాడు ఆ తండ్రి. ఇలాంటి విచిత్ర సంఘటనల నేపథ్యంలో హాస్యరసం ఎక్కువగా ఉంటూ తీసిన సినిమా బ్రో డాడీ.

ఈ సినిమా చాలా పరిమిత బడ్జెట్‌లో తీయవచ్చు. అలాగే కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే అవకాశం చాలానే ఉంది. సినిమాల్లోకి రీ-ఎంట్రీ అయిన తర్వాత తనలోని కామెడీ యాంగిల్‌ని చూపించే అవకాశాలు రాని చిరంజీవికి ఈ సినిమా ఆ సౌలభ్యం ఇస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి నుంచి చంటబ్బాయి, దొంగ మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లనే మెగా అభిమానులు కూడా కోరుతున్నారు. ఈ సినిమా వారి కోరికను తీర్చి అందరూ ఆనందించే ఎంటర్‌టైనర్‌గా మారుతుందని ఆశిద్దాం.

Megastar Chiranjeevi is interested to do another Malayalam remake film

0

Another Malayalam remake on cards from Chiranjeevi is the news which is circulating in industry these days. Fans after Godfather expressed their dissatisfaction about mega family doing remakes.

But it looks like that mega heroes aren’t taking the feedback seriously. Bro Daddy is a hilarious entertainer from Malayalam Industry and sources claim that Megastar Chiranjeevi is keen to remake this movie in Telugu.

Bro Daddy is a multistarrer in which Mohan Lal and Pruthviraj acted as father and son. Prithviraj also happens to be the writer and director of the film. In Telugu remake there would be a chance for another Mega hero in the young lot to play the son of Megastar.

This movie can be made on a very limited budget but has a lot of potential to bring families to the theater. This movie gives a scope for Chiranjeevi to explore the comedy angle of his acting once again, which he hasn’t got a chance after his re-entry to the films.

Mega fans are also asking for hilarious entertainers like Chantabbai, Donga Mogudu, Shankar Dada MBBS etc. from him. Let’s hope this movie fulfills their wish and becomes an enjoyable entertainer.

Singam 4 on cards, Suriya- Hari to join hands again!

0

Suriya’s Singam is one of the most successful Kollywood franchises. While Singam 1 and Singam 2 were massively successful and got excellent box office collections, Singam 3 didn’t live up to expectations. Now Hari has a point for Singam 4 which was liked by Suriya and the Kollywood star has asked him to work on a complete script. Both are interested in Singam 4 and it will go to sets once script work is completed.

The first installment of the series Singam 1 hit the screens in 2010. It featured Suriya in the role of a cop and Anushka played the female lead. It emerged as a sensational blockbuster. Its sequel was released in 2013 and starred Hansika alongside Suriya and Anushka. Singam 2 too did well at the box office.

The franchise’s third installment, titled Si 3, made its way to theatres in 2017 and featured Shruti Haasan. This film received mixed reviews and decent collections but wasn’t as big a hit as its predecessors.

బాక్సాఫీస్ వద్ద ఇటీవలి అక్కినేని హీరోల సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన సమంత యశోద

0

బాక్సాఫీస్ వద్ద సమంత క్రేజ్ నానాటికీ పెరుగుతోంది. సినిమా తర్వాత సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఆమె నటన మరియు స్టార్ డం పురుష తారలను మించిపోతోంది. ఆమె నటనా సామర్థ్యాలు, స్క్రిప్ట్‌ల పై పదునైన తీర్పు, అందం మరియు ఆమె వ్యక్తిత్వం ఆమెను అగ్రస్థానంలో ఉంచాయి.

తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా విడుదలైన నేపథ్యంలో సమంత అభిమానులు, సినీ ప్రేమికులు యశోద తొలి రోజు కలెక్షన్లను అక్కినేని హీరోల ఇటీవలి సినిమాల కలెక్షన్లతో పోల్చుకుంటున్నారు. సహజంగానే, సమంత వారి కంటే చాలా ముందున్నారు.

నెటిజన్లు ఎప్పుడూ ఇద్దరు స్టార్ల కలెక్షన్‌లను పోల్చడానికి మరియు వారి సంబంధిత క్రేజ్‌ను అంచనా వేయడానికి ఇష్టపడతారు. వారందరికీ అదొక సరదా. ఇది ప్రత్యేకంగా ఈరోజు వచ్చిన కొత్త పద్ధతేమి కాదు. కానీ సమంత తన విడాకుల తర్వాత ఈ సినిమాను విడుదల చేయడం సమంత మరియు అక్కినేని వంశ అభిమానులను ఈ పోలికల జోలికి వెళ్ళేలా చేసింది.

యశోద కలెక్షన్స్ కూడా సమంత డామినేషన్‌ని చాటుతున్నాయి. అక్కినేని కుటుంబం నుండి వచ్చిన థాంక్యూ, ది ఘోస్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి. మరోవైపు యశోదకు మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే ఒక స్టార్‌కి ఉన్న క్రేజ్‌ పైనే ఓపెనింగ్ డే కలెక్షన్లు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

యశోద USAలో 200k డాలర్లు వసూలు చేసింది, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించింది, ముఖ్యంగా A సెంటర్లలో చాలా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రోజు ముగిసేసమయానికి యశోద యొక్క తెలుగు వెర్షన్ 5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది స్పష్టంగా నాగ చైతన్య థాంక్యూ కలెక్షన్ల కంటే ఎక్కువ. తమిళ వెర్షన్లో కూడా యశోదకు మంచి స్పందన వచ్చింది.

దీంతో సమంత అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. యశోద బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం మహిళలు ప్రధాన పాత్రలో నటించే సినిమాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ట్రెండ్‌ను మరోసారి ప్రారంభించినందుకు సమంత నిజంగా రోల్ మోడల్ గా నిలిచారు.

హరి హరీష్ జంటగా యశోద సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ – ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.