Home Blog Page 1061

కల్కి 2898 ఏడి మాదిరిగా SSMB29 కూడానా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఫస్ట్ డే నెగటివ్ టాక్ సంపాదించిన ఈ మూవీ ఆ తరువాత మహేష్ స్టార్డంతో మంచి కలెక్షన్ రాబట్టి థియేటర్స్ లో బాగా కొనసాగి పలు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అందుకుంది. ఇక దాని అనంతరం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీయనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 లో హీరోగా నటించనున్నారు సూపర్ స్టార్ మహేష్. 

ఇప్పటికే ఈ మూవీ కోసం బల్క్ గా బాడీని పెంచడంతో పాటు పలు యుద్ధ విద్యల్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు మహేష్ బాబు. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీ ఎప్పుడెప్పుడు అనౌన్స్ అవుతుందా అని కేవలం సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు నార్మల్ ఆడియన్స్ సైతం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

విషయం ఏమిటంటే, ఈ మూవీలో మహేష్ పాత్రని హనుమంతుని ఇన్స్పిరేషన్ తో సిద్ధం చేస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక మూవీలో భారీ యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలు ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా పక్కాగా స్టోరీ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ మూవీలో కూడా ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన కల్కి 2898 ఏడి మాదిరిగా మైథాలజీ అంశాన్ని జక్కన్న టచ్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అదే కనుక నిజం అయితే జక్కన్న వాటిని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. కాగా SSMB29 మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

Nandhamuri Mokshagna పాన్ ఇండియన్ డెబ్యూ కి రెడీ అయిన నందమూరి మోక్షజ్ఞ

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న శ్రీ ఎన్టీ రామారావు గారి తనయుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి చిత్రం నుండి ఎందరో ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని తన అద్భుత నటనతో అలరిస్తూ ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇంకా పలు మంచి చిత్రాలు చేస్తూ కొనసాగుతున్న బాలకృష్ణ నటవారసుడైన నందమూరి మోక్షజ్ఞ తేజ మూవీ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే సినిమాలకు సంబంధించి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ అతి త్వరలో సినీ అరంగేట్రానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎల్లో కలర్ టీ షర్ట్ లో ట్రెండీ లుక్స్ తో స్పెట్స్ పెట్టుకుని ఉన్న మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియన్ రేంజ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తేజ సజ్జ తో హనుమాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మోక్షజ్ఞ కోసం ఒక అద్భుతమైన కథని సిద్ధం చేసారని, కాగా పాన్ ఇండియన్ రేంజ్ లో పూర్తి స్క్రిప్ట్ సిద్ధమవుతోన్న ఈమూవీ మోక్షజ్ఞ బర్త్ డే నాడు అనగా సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా అతిరథ మహారథుల సమక్షంలో లాంచ్ కానుందని టాక్. అయితే ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Pawan Kalyan ఈ ఏడాది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఖాయమేనట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన జనసేన పార్టీ తరపున టిడిపితో జతకట్టి కూటమిగా ఏర్పడి భారీ విజయం అందుకున్నారు. ఇక పిఠాపురం నుండి మంచి మెజారిటీతో ఎమ్యెల్యేగా గెలిచిన పవన్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. ఇక మరోవైపు త్వరలో తాను పెండింగ్ లో పెట్టిన మూడు మూవీస్ ని త్వరలో పూర్తి చేసేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

ఇక పవన్ ప్రస్తుతం సుజీత్ తో ఓజి, క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేస్తున్నారు. అయితే వీటిలో పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ఓజి ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఆ మూవీకి సంబంధించి పెండింగ్ షూట్ ని అతి త్వరలో ప్రారంభించి వీలైనంత త్వరలో పూర్తి చేయనున్నారని, అలానే ఆ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. 

కాగా ఈమూవీ మొదటి పార్టు సగభాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరక్కించగా మిగతా భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీస్తున్నారు. కాగా హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Venkatesh 76 Heroine Update: వెంకీ – అనిల్ కాంబో మూవీలో హీరోయిన్ గా టాలెంటెడ్ నటి

విక్టరీ వెంకటేష్ ఇటీవల యువ దర్శకుడు శైలేష్ కొలను తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. వెంకటేష్ కెరీర్ 75వ మూవీ గా రూపొందిన సైంధవ్ రిలీజ్ అనంతరం పర్వాలేదనిపించేలా మాత్రమే ఆడింది. ఇక దీని అనంతరం సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన నెక్స్ట్ మూవీ చేసేందుకు సిద్దమయ్యారు వెంకీ మామ. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండగా రేపు ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు.

లవ్, ఫన్ తో పాటు ఎమోషనల్, ఫామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో హీరోయిన్ గా టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కొద్దిసేపటి క్రితం టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

అందంతో పాటు చక్కని అభినయం కూడా చేయగలిగిన ఐశ్వర్యకు ఈ మూవీ మరింత మంచి క్రేజ్ తీసుకువస్తుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక గతంలో వెంకటేష్ తో అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్ రెండూ కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరి మూడవ కాంబోలో రూపొందనున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

Shankar announces his next projects

0

Maverick Director, Shankar is currently busy in promotional activities for his upcoming film, Indian 2. The Director is interacting with reporters about many things and he has also announced his next projects other than Indian 3, third part in Indian series. Shankar is also working for Game Changer starring Ram Charan which is also under shoot stage currently.

Shankar said that he had three ideas about his upcoming films. One will be historical and the other will follow James Bond films’ style and last one is related to science fiction like 2012. These three films will surely require high budget and VFX works. When asked about Game Changer the director replied that there were only 15-20 days of shooting left. He also was confident of finishing it after Indian 2 release.

Shankar will concentrate on Indian 3 after Game Changer as well. It needs to be seen which film he’ll take forward as his next film after these two films. The Director also rejected that he wanted to make a film like Avatar which deals with Underwater world and adventure. On the other hand, Indian 2 is all set for release this July 12th worldwide in Telugu, Tamil and Hindi.

Telugu Top 5 grossing films: Only Prabhas and Rajamouli

0

Until Baahubali, only top heroes of Tollywood had highest grossing films. But Prabhas and SS Rajamouli rose to nationwide fame with Baahubali series and things have changed afterwards. So much so that the top 5 highest grossing films in Telugu language are under their names surprisingly.

Prabhas didn’t manage to score an Industry hit before Baahubali as a solo hero. Rajamouli too had only Magadheera in his list. But they both collaborated for Baahubali and made sure no others could come close to them. Now, as said, they hold all the top 5 grossing films in their list. Starting with RRR, Baahubali 2, Salaar, Kalki 2898 AD and Baahubali 1. All these films have either of these duo.

RRR currently stands on the top with 365 crores gross worldwide followed by Baahubali 2 with 310 crores, Salaar with 213 crores, Kalki 2898 AD, the latest entry with 200 crores and Baahubali 2 with 184.34 crores. Kalki 2898 AD may even go close to 300 crores gross mark worldwide if the next weekend does well. Prabhas also happens to be the actor with 200 crore grossers consecutively in Telugu. No other hero has this record as a solo film. Baahubali is surely working for him.

Kamal Haasan rejected Shankar’s offer of 2.0

0

2.0 directed by Maverick Director, Shankar starred Superstar Rajinikanth in the lead role. The film was also a sequel to the blockbuster, Enthiran/Robo. Director Shankar is currently busy with his promotional interviews of Indian 2. He interacted with reporters and revealed an interesting news that Kamal Haasan had actually rejected his offer in 2.0. This has shocked everyone now.

Director Shankar told that he initially planned to rope in Kamal Haasan in the antagonist role that Akshay Kumar had played in 2.0. But due to Kamal Haasan’s busy schedule then he couldn’t accept the role. But netizens feel that Kamal Haasan would have intentionally rejected this offer to avoid sharing screen with Rajinikanth as a villain. They also feel that he rejected it in the name of schedule.

The antagonist role was also offered to Hollywood Superstar, Arnold Schwarzenegger once. But due to the budget constraints, the film didn’t take off with him. Now this news has also stunned everyone. On the other hand, Kamal Haasan and Shankar’s current film Indian 2 is all set for release this July 12th worldwide. The team has completed all the formalities and the trailer has also been released. Fans hope the film would become a blockbuster.

Kalki 2898 AD claims all-time record despite Pathaan’s record

0

Kalki 2898 AD starring Prabhas opened to a humongous response. The film had indicated this with the advance bookings itself. It broke the record of advance bookings gross in North America region as well. The film also had a fantastic weekend grossing over 500 crores worldwide. Now, Kalki 2898 AD has claimed an all-time record despite Pathaan’s existing record.

The film as said is sensational in North America market. Now, the film has collected $1Million consecutively for 5 days. The team has claimed this as an all-time record but Pathaan previously held this record. The team of Kalki 2898 AD have also released an official poster claiming this record. But Pathaan had collected a consecutive $1Million for 5 days in this market. We have to see how Pathaan’s team responds to this.

On the other hand, Kalki 2898 AD is performing stunningly in the domestic market. It has already crossed the 200 crore gross mark from Telugu version alone worldwide. It is also all set to become the first 1000 crore film for Prabhas apart from Baahubali series. This is definitely a great news for fans of Prabhas as he has also managed to equal the record of Shah Rukh Khan as of now.

Revanth Reddy’s Pre-Condition for Ticket Hike

0

It appears like we will get to see more Tollywood stars and directors featuring in anti-drug awareness videos in the coming days. Mega Star Chiranjeevi recently uploaded a similar video and Telangana Chief Minister Revanth Reddy appreciating this move has stated that producers who will seek ticket hikes might have to follow Chiranjeevi’s initiative.

He directed the officials to set a pre-condition to filmmakers to provide a video of one or two minutes duration to the government to promote awareness on drugs and cybercrime when they approach the government to hike ticket prices.

The video can be made with the same cast who acted in the film for which permission to hike ticket prices is sought, said Revanth Reddy.

He said he agrees that films are made with an investment of crores of rupees but drugs are a societal problem, he said. Filmmakers should give back to the society, he said. He instructed that cinema theatre owners should screen short-duration films free of cost before beginning the film screening to promote awareness against drugs and cybercrime.

Kalki 2898 AD Box Office: ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఆ లిస్ట్ లో ‘కల్కి 2898 ఏడి’ చేరుతుందా ?

ఇటీవల సలార్ తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా వైజయంతి మూవీస్ సంస్థ పై నాగ అశ్విన్ తెరకెక్కించిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడి ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మరొక సక్సెస్ అందుకున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలు చేసారు. 

తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన కల్కి 2898 ఏడి మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇక అన్ని ఏరియాలతో పాటు ముఖ్యంగా ప్రస్తుతం నార్త్ అమెరికా, ఓవర్సీస్, నైజాం, నార్త్ లలో కల్కి బాగా కలెక్షన్ రాబడుతోంది. ఇక ఇప్పటికే గడచిన ఐదు రోజులకుగాను రూ. 555 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ మూవీ త్వరలోనే రూ. 1000 కోట్ల మార్క్ ని చేరుకుంటుందనేది పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం. 

వాస్తవానికి గత ఏడాది ప్రభాస్ నుండి రిలీజ్ అయిన ఆదిపురుష్, సలార్ రెండూ కూడా ఈ మార్క్ ని అందుకోలేకపోయాయి. ఇక జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ బ్లాక్ బస్టర్స్ బాహుబలి, బాహుబలి 2 మూవీస్ అనంతరం వరుసగా పలు పాన్ సినిమాలు చేస్తూ హీరోగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. అయితే తెలుగు సినిమాల్లో బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1900 కొల్లగొట్టగా ఆ తరువాత ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ రూ. 1250 కోట్లు రాబట్టింది. మరి దాని తరువాత రూ. 1000 కోట్ల మార్క్ ని కల్కి 2898 ఏడి దాటేస్తుందో లేదో చూడాలి. 

కాగా తప్పకుండా బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తరువాత రూ. 1000 కోట్ల మార్క్ దాటిన మూవీస్ లిస్ట్ లో కల్కి కూడా పక్కాగా చేరడం ఖాయమని పలువురు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతున్నారు. మరి కల్కి 2898 ఏడి మూవీ రూ. 1000 కోట్ల మార్క్ ని ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి.