HomeMovie Newsనిహారిక విడాకుల పై నాగబాబు ఏమన్నారంటే ?

నిహారిక విడాకుల పై నాగబాబు ఏమన్నారంటే ?

- Advertisement -

మెగా బ్రదర్స్ లో బిగ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు.

ఇక నాగబాబు ప్రస్తుతం అక్కడక్కడ పలు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కుమార్తె నిహారిక కొణిదెల కూడా పలు సినిమాల్లో నటిస్తుండడటంతో పాటు నిర్మాతగా తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ పై సినిమాలు నిర్మిస్తున్నారు.

కాగా అసలు విషయం ఏమిటంటే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ నిహారిక కొణిదల, చైతన్య వివాహం విషయంలో మేము సరైన ఆలోచన చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే కొన్ని కారణాల రీత్యా వారిద్దరు విడిపోయారని చెప్పుకొచ్చారు.

అయితే త్వరలోనే నిహారిక సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని తన స్నేహితులు బంధువులు శ్రేయోభిలాషులు కోరుతున్నారని, తాము కూడా ఆమె కొత్త జీవితం ప్రారంభిస్తే చూడాలనుందని అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పటివరకు నిహారిక కొణిదల విడాకులపై స్పందించని నాగబాబు తొలిసారిగా రెస్పాండ్ అవ్వటంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories