HomeMovie NewsMalavika Mohanan to Act with Mohanlal మోహన్ లాల్ తో నటించనున్న మాళవిక 

Malavika Mohanan to Act with Mohanlal మోహన్ లాల్ తో నటించనున్న మాళవిక 

- Advertisement -

మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఇటీవల బరోజ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ అనంతరం తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సిరీస్ లోని రెండవ మూవీ అయిన ఎంపురాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని మోహన్ లాల్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు ఆయన మరొక మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో రూపొందనున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ చేయనున్నారు. 

ఇప్పటికే ఈమూవీ ప్రారంభానికి అంతా సిద్ధం అయింది. కాగా ఈ మూవీలో అందాల భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి 10 నుండి గ్రాండ్ గా సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ మలయాళంలో తనకు మంచి పేరు గుర్తింపు తీసుకువస్తుందని మాళవిక భావిస్తున్నారు. ఇక ఇటు తెలుగులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ది రాజా సాబ్ లో మాళవిక ఒక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలు నటిగా ఆమెకు ఎంతమేర పేరు తీసుకువస్తాయో చూడాలి. 

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories