HomeMovie News'కన్నప్ప' ఓటిటి అప్ డేట్

‘కన్నప్ప’ ఓటిటి అప్ డేట్

- Advertisement -

మంచు విష్ణు హీరోగా ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా ముఖేష్ కుమార్ సింగ్ తీసిన లేటెస్ట్ మైథలాజి పాన్ ఇండియన్ డివోషనల్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు దీనిని భారీ స్థాయిలో నిర్మించాయి.

రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. మంచి విష్ణు చివరి అరగంట కనబరిచిన ఎమోషనల్ యాక్టింగ్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే కలెక్షన్ తో కొనసాగుతోంది.

అయితే అసలు విషయం ఏమిటంటే కన్నప్ప ఓటిటి గురించి హీరో మంచు విష్ణు తాజాగా మాట్లాడుతూ ఈ సినిమా ఓటిటి డీల్ ప్రకారం 10 వారాల వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదనిఅన్నారు.

అందుకే తప్పకుండా తమ మూవీని థియేటర్స్ లోనే చూసి ఆడియన్స్ అందరూ ఆదరిస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వాస్తవానికి హిందీలో కూడా రిలీజ్ కారణంగా, అక్కడి నేషనల్ మల్టి ప్లెక్స్ రిలీజ్ వలన ఈ సినిమాకి ఎనిమిది వారాల వరకు ఓటిటిలో అందుబాటులో ఉండే అవకాశం ఉండదనేది తెలిసిందే.

మొత్తంగా ఇది కన్నప్పకి థియేటర్స్ లో కలిసి వచ్చే అంశమేనని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఓవరాల్ గా కన్నప్ప ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories