గత మూడురోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా చర్చకు దారి తీసిన అంశం ఒక గాసిప్ వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్ రేటింగ్స్ కొరకు కొన్ని సంవత్సరాలపాటు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక స్థాయి కి వచ్చిన వ్యక్తుల పై విషం చిమ్మటమే పనిగా పెట్టుకొని, తెలియని వాళ్ళని లోంగతీస్కొని బ్లాక్ మెయిలింగ్ చెయ్యటమే వీళ్ళ జర్నలిజం.
విషయం లోకి వస్తే తెలుగు సినిమా లో అర్జున్ రెడ్డి సినిమా తో సంచలనం రేపిన విజయ్ దేవరకొండ తనకు ఉన్న వనరులతో మధ్య తరగతి నిధి (Middle Class Fund) అని ఒక సేవ సంస్థ స్థాపించి ఈ విపత్కర పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని నా వీలైనంత వరకు ఆదుకుంటాను అని ట్విట్టర్ ని వేదిక గా చేసుకొని ప్రకటించాడు దానికి ఎప్పుడు సామాజిక స్పృహ తో సినిమాలు తీసే దర్శకుడు కొరటాల శివ మరియు విజయ్ మీద అభిమానంతో నెటిజన్లు విరాళాలు ఇవ్వటం మొదలు పెట్టారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది సహాయం కోసం దరఖాస్తు చేసుకోవడం తో కొత్త దరఖాస్తుల స్వీకరణను టీం దేవరకొండ ఆపివేసింది.
ఇంతలో విజయ్ సదరు గాసిప్ వెబ్సైట్ కు ఇంటర్వ్యూ ఇవ్వటం కుదరదు అనటం తో ఇదే అదునుగా తీసుకొని సదరు వెబ్సైట్ విజయ్ పై సహాయం చేస్తే ఎవరికి తెలీకుండా చెయ్యాలి కాని ఇలాంటి ప్రచార ఆర్భాటాలకు దిగాకూడదు విషం చిమ్ముతూ కథనాలు అల్లింది.
దానికి విజయ్ ఘాటుగా స్పందిస్తూ విజయ్ #KillFakeNews అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో సదరు వెబ్సైట్ నీ తిడుతూ పోస్ట్ చెయ్యటమ్ జరిగింది దానికి సూపర్స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మద్దతు తోడవడంతో గొడవ పెద్దదైంది, కింగ్ నాగర్జున స్పందిస్తూ ఇటువంటి వాటిని రాకుండా ఆపటానికి ఒక ప్రణాళిక సిద్ధం చెయ్యాలి అనటం తో భయపడ్డ సదరు వెబ్సైట్ తన తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టింది.
తాము ఏ విషయం అయిన అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఉండే లానే రాస్తాం అని కావాలంటే మేము మీ సినిమాలకి ఇచ్చిన రేటింగ్స్ చూడండి అంటూ దృష్టి ఫేక్ న్యూస్ నుండి రేటింగ్స్ మీదకు మార్చటం మొదలు పెట్టారు.
కానీ మేము చెప్తుంది నువ్వు మా సినిమాలకి ఇచ్చే రేటింగ్స్ గురించి కాదని, నీ వెబ్సైట్ రేటింగ్స్ కొరకు, పాపులారిటీ కొరకు రాసే అసభ్యమైన తప్పుడు కథనాలు గురించి అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.