HomeMovie News'హరి హర వీర మ'ల్లు' న్యూ రిలీజ్ డేట్ అదేనా ?

‘హరి హర వీర మ’ల్లు’ న్యూ రిలీజ్ డేట్ అదేనా ?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ డ్రామా మూవీ హరిహర వీరమల్లు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఏం రత్నం ఈ మూవీని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. విఎస్ జ్ఞానశేఖర్ తో పాటు మనోజ్ పరమహంస దీనికి ఫోటోగ్రఫి అందిస్తున్నారు

వాస్తవానికి ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా కొద్దిపాటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ కారణంగా కొన్నాళ్లపాటు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్ 12 రిలీజ్ కావాల్సిన ఈ మూవీ జూలై 18 గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

ఇందులో గజదొంగ వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండగా ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, నర్గీస్ పక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు వాయిదా పడ్డ హరిహర వీరమల్లు జూలై 18న రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి. 

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories