Home Movie News దీపికా పదుకొనె కామెంట్స్ వైరల్ 

దీపికా పదుకొనె కామెంట్స్ వైరల్ 

sandeep reddy vanga deepika padukone

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాల్లో ఒకటి మారుతీ తెరకెక్కిస్తున్న ది రాజాసాబ్ కాగా మరొకటి హను రాఘవపూడి తీస్తున్న ఫౌజీ. ఈ రెండు సినిమాలపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉన్నాయి.

అయితే వీటిలో అతి త్వరలో ది రాజాసాబ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండగా ఫౌజీ వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల అనంతరం త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్.

ఈ సినిమాలో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. ఆపైన తమ మూవీలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి ని  చేసారు.

అనంతరం స్పిరిట్ కి సంబంధించి ఒక జాతీయ ఆన్లైన్ పోర్టల్ లో న్యూస్ రావడం, అందులో స్పిరిట్ నుండి దీపికా తప్పుకోవడం, ఆమె పాత్ర కొంత మేర కథకి సంబంధించి న్యూస్ రాసారు. దానితో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన ట్విట్టర్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా దీపికా పదుకొనె పై అసహనం వ్యక్తం చేసారు.

తాజాగా దాని పై స్పందించని దీపికా, ఒక ఫాషన్ షో లో భాగంగా వ్యాఖ్యానించారు. అయితే ఆమె కూడా ఇన్ డైరెక్ట్ గానే స్పందించారు. తన మనసు చెప్పిందే తాను చేస్తానని, జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే నిజాయితీ ముఖ్యం అని ఆమె అన్నారు. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సందీప్ రెడ్డిని ఉద్దేశించి అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version