Home Movie News Vidaamuyarchi Ajiths most Violent Film అజిత్ మోస్ట్ వయొలెంట్ మూవీగా ‘విడాముయార్చి’

Vidaamuyarchi Ajiths most Violent Film అజిత్ మోస్ట్ వయొలెంట్ మూవీగా ‘విడాముయార్చి’

Vidaamuyarchi
Vidaamuyarchi

కోలీవుడ్ స్టార్ యాక్టర్ తలా అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యక్షన్ మూవీ విడాముయార్చి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈమూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో అర్జున్, రెజీనా కసాండ్ర, నిఖిల్ నాయర్ తదితరులు నటిస్తున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే లభించింది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 6న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ట్రైలర్, టీజర్ ని బట్టి చూస్తే విడాముయార్చి అజిత్ కెరీర్ లోనే మోస్ట్ వయొలెంట్ ఫిలిం అని తెలుస్తోంది. 

మరోవైపు సింగపూర్ సెన్సార్ ఈ మూవీకి M18 రేటింగ్ ఇవ్వడాన్ని బట్టి ఇందులో వయొలెన్స్ ఉందని, అలానే ఇది కేవలం పెద్దవారు మాత్రమే చూసే మూవీ అని అర్ధమవుతోంది. ఇక ఇటు మన తెలుగులో పట్టుదల టైటిల్ తో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ కి బాగానే రెస్పాన్స్ లభిస్తోంది. మొత్తంగా విడాముయార్చి పై అజిత్ ఫ్యాన్స్ అయితే ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. మరికొద్దిరోజుల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

Show comments
Exit mobile version