Home Movie News వీకెండ్ లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్న ‘థగ్ లైఫ్’

వీకెండ్ లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్న ‘థగ్ లైఫ్’

thug life

చాలా ఏళ్ళ విరామం అనంతరం కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీలో శింబు  పాత్ర చేయగా త్రిష హీరోయిన్ గా నటించింది.

ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో తనికెళ్ళ భరణి, నాజర్, మహేష్ మంజ్రేకర్, అభిరామి తదితరులు ఇతర పాత్రలు చేసారు. మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మూవీస్ సంస్థలు గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ డే నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు ఈ మూవీ రూ. 72 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది. తమిళ నాడులో కేవలం రూ. 33 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఇతర ప్రాంతాల్లో ఈ వీకెండ్ లో దారుణంగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తోంది. థగ్ లైఫ్ యొక్క బ్రేకీవెన్ రూ. 300 కోట్లు కాగా ఈ వీకెండ్ లో మూవీ మొత్తంగా 25% మాత్రమే రాబట్టే అవకాశం ఉంది.

దీనిని బట్టి ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ఇండియన్ 2 తో పోలిస్తే డబుల్ డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. ఎప్పుడో గతంలో నాయగన్ కాంబో క్రేజ్ తో వచ్చిన ఈ మూవీ మొత్తంగా ఇంత ఘోరంగా కొనసాగుతుండడంతో కమల్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version