Home Movie News ‘ఖలేజా’ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ తో ‘అతడు’ పై పెరిగిన అంచనాలు 

‘ఖలేజా’ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ తో ‘అతడు’ పై పెరిగిన అంచనాలు 

khaleja

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఖలేజా. ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. 2010లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది.

ఇక పదిహేనేళ్ల అనంతరం తాజాగా మళ్ళి ఈ మూవీని థియేటర్స్ లోకి రీ రిలీజ్ చేసారు. అయితే ఈ మూవీ ప్రీమియర్స్ నుండి క్లోజింగ్ వరకు సూపర్ కలెక్షన్ సొంతం చేసుకుంది. అంతకముందు సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి మూవీ రీ రిలీజ్ పరంగా పెద్ద రికార్డు నెలకొల్పగా దానిని ఖలేజా బీట్ చేసింది.

ఈ మూవీ రీ రిలీజ్ కి థియేటర్స్ లో సూపర్ ఫ్యాన్స్ మహేష్ బాబు కామెడీ టైమింగ్, యాక్షన్, ఫైట్స్, త్రివిక్రమ్ డైలాగ్స్ ని ఎంతో ఎంజాయ్ చేసారు. అయితే విషయం  ఏమిటంటే, ఆగష్టు 9న మహేష్ బాబు జన్మదినం సందర్భంగా అతడు మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది.

ఇక ఈ మూవీ యొక్క రైట్స్ ఇప్పటికే భారీ ధరకు అమ్ముడు కాగా దీనిని మరింత గ్రాండియర్ గా అత్యధిక థియేటర్స్ లో రీ రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2005 లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న అతడు మూవీ టివిల్లో అత్యధిక సార్లు ప్రదర్శితం అయిన మూవీగా రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version