సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ చేసే సినిమా పై ఇంకా క్లారిటీ రాలేదు . వంశి పైడిపల్లి కథ నచ్చకపోవడం తో పరశురామ్ తో తర్వాత చేద్దామనుకున్న సినిమా ని ఇప్పుడే చేద్దామనుకున్నాడు మహేష్ . పరశురామ్ , మహేష్ నుండి ఫోన్ రాగానే సరే అనేశాడు . కథ నచ్చింది , డైరెక్టర్ , హీరో రెడీ గ వున్నారు ఇంకా ఎందుకు ఈ సినిమా ఆలస్యం అవుతుందనేది ఎవరికీ అర్ధం కానిది . మాకున్న సమాచారం మేరకు మొదట మహేష్ సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ లో వున్నప్పుడు పరశురామ్ మహేష్ ని కలిసి కథ చెప్పాడు , ఈ కథ కోసం కొరటాల శివ కూడా పని చేసాడు. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి తాను కూడా కో ప్రొడ్యూసర్ గ వుండాలనుకున్నాడు. కానీ మహేష్ తర్వాత సినిమా వంశి పైడిపల్లి తో చేద్దామనుకునేసరికి , పరశురామ్ సినిమా కథ దశలోనే ఆగిపోయింది .
దీనితో పరశురామ్ కూడా తన తర్వాత సినిమా నాగచైతన్య తో చెయ్యాలనుకున్నాడు , ఈ సినిమా ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా కి పరశురామ్ అడ్వాన్స్ కూడా తీసుకొని ఆఫీసియల్ గ అనౌన్స్ చేసారు . కానీ ఎప్పుడైతే మహేష్ నుండి పిలిపు రావడం తో పరశురామ్ మహేష్ తో చేసి తర్వాత నాగ చైతన్య తో చేద్దామనుకున్నారు . కానీ దీనికి 14 రీల్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంట , మా దగ్గర తర్వాత సినిమా చేస్తా అని అడ్వాన్స్ తీసుకున్నావ్ నువ్వు ఎవరితో చేసిన మా ప్రొడక్షన్ లోనే చెయ్యాలి అని అంటున్నారు వాళ్ళు . దీనితో పరశురామ్ – మహేష్ సినిమా కి నిర్మాతలు ఎవరో తెలియని పరిస్థితి . ఇప్పుడు ఈ సినిమా మైత్రి మూవీస్ లో చెయ్యాలా 14 రీల్స్ ప్లస్ లో చెయ్యాలా అనేది అర్ధం కావట్లేదు పరశురామ్ కి .
ఇప్పుడు 14 రీల్స్ వాళ్ళు , మైత్రి వాళ్ళు కలిసి మాట్లాడుకొని ఈ సినిమా మీద ఎదో ఒక డెసిషన్ తీసుకునేవరకు ఈ సినిమా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంటుంది . ఈ సినిమా ని మైత్రి వాళ్ళు చేస్తారో , 14 రీల్స్ ప్లస్ వాళ్ళు చేస్తారో లేదా ఇద్దరికీ ప్రొడ్యూస్ చేస్తారో చూడాలి .