HomeMovie Newsరామ్ చరణ్ తో మాటల మాంత్రికుడి మూవీ ఫిక్స్ ?

రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడి మూవీ ఫిక్స్ ?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు సన దర్శకత్వంలో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ పెద్ది. ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తుండగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ అందర్నీ ఆకట్టుకుని సినిమాపై అంచనాలు బాగా ఏర్పరిచింది. ఇందులో రామ్ మాస్ పాత్ర చేస్తుండగా శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే దీని అనంతరం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ చేయాల్సి ఉంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం పెద్ది అనంతరం రామ్ చరణ్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నారని అంటున్నారు.

ఇప్పటికే త్రివిక్రమ్ రాంచరణ్ కి ఒక స్టోరీ లైన్ వినిపించుగా ఆయనకు ఎంతో నచ్చిందని ఫ్యామిలీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. కాగా దీని అనంతరమే సుకుమార్ సినిమా ఉంటుందని చెప్తున్నారు. 

See also  'వార్ - 2' టీజర్ : అంచనాలు అందుకోలేదు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories