HomeMovie Newsబ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్న 'పుష్ప - 2' హిందీ టివి ప్రీమియర్ 

బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్న ‘పుష్ప – 2’ హిందీ టివి ప్రీమియర్ 

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించగా నేషనల్ క్రాస్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించారు. మంచి అంచనాలతో విడుదలైన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించింది.

ముఖ్యంగా పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ అద్భుతమైన యాక్టింగ్ తో పాటు సుకుమార్ టేకింగ్, యాక్షన్ అంశాలు, సాంగ్స్ వంటివి అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీని ఇంత పెద్ద సక్సెస్ చెసాయి.

అటు నార్త్ లో రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల పుష్ప 2 మూవీ యొక్క హిందీ టెలివిజన్ ప్రీమియర్ ని ప్రదర్శించగా దానికి సూపర్ గా రెస్పాన్స్ లభించింది.

ఒకరకంగా ఈ మూవీకి సీక్వెల్ హైప్ వర్కౌట్ కావడంతో అటు థియేటర్స్, ఓటిటితో పాటు టివిలో కూడా బాగా రెస్పాన్స్ అందుకుంది. కాగా ఈమూవీ 5.1 రేటింగ్ అందుకోవడం విశేషం. 

See also  'హరి హర వీర మ'ల్లు' న్యూ రిలీజ్ డేట్ అదేనా ?

కోవిడ్ అనంతరం హిందీ మూవీస్ టివి ప్రీమియర్ టిఆర్పి రేటింగ్స్ 

  • గదర్ 2: 6
  • జవాన్: 5.4
  • పుష్ప-2: 5.1
  • వీధి 2: 4.3
  • KGF చాప్టర్ 2: 4.2
  • పఠాన్: 4.2
  • ఆనిమల్: 2.3

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories