మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తన తర్వాత సినిమా రెబెల్ స్టార్ ప్రభాస్ తో అని అనౌన్స్ చేసాడు. ఈ కాంబినేషన్ ఎవరు ఊహించనది . అందరు ప్రభాస్ తర్వాత సినిమా సందీప్ వంగ , కొరటాల శివ , రాజమౌళి తో ఉంటుంది అని అనుకున్నారు నాగ్ అశ్విన్ పేరు అసలు బయటికి రాలేదు. అసలు వీళ్లు ఎప్పుడు కలిశారు సినిమా ఎప్పుడు చేద్దామనుకున్నాడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసమే కథ తయారు చేశాడా ఇలా చాల ప్రశ్నలు మిగిలిపోయాయి. మాకున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్ ఈ కథ ని చిరంజీవి కోసం తయారు చేసారు . అశ్వినిదత్ – చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. చిరంజీవి రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమా లు చెయ్యడం మొదలుపెట్టాక అశ్వినిదత్ ఎలా ఐన చిరు తో ఒక సినిమా చేద్దామనుకున్నాడు. మహానటి తర్వాత చిరంజీవి తో కూడ ఈ విషయం చెప్పాడు చిరంజీవి కూడ సరే అన్నాడు దానితో నాగ్ అశ్విన్ ఒక ఫాంటసీ స్టోరీ రెడీ చేసాడు , చిరంజీవి కి కూడ కథ నచ్చింది అంత ఒకే అనుకుని చేద్దామనుకున్నప్పుడు రాజకీయ విభేదాలు ఈ సినిమా ని మార్చేసింది .
చిరంజీవి మూడు రాజధానులు మంచిది అని జగన్ కి సపోర్ట్ చెయ్యడం , అశ్వినిదత్ కి అది నచ్చకవపోవడం వెంటనే మీడియా లో చిరంజీవి కి ఎం తెలుసు నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. కొన్ని రోజులు గ ఇలాంటి రాజకీయా విభేదాలు వాళ్ళ చిరంజీవి అశ్వినిదత్ తో సినిమా చెయ్యను కావాలంటే నా ప్రొడక్షన్ లో సినిమా చేస్తా అన్నాడంట. అశ్వినిదత్ సొంత అల్లుడు ఐన నాగ్ అశ్విన్ దీనికి ఒప్పుకోలేదు తన అన్ని సినిమాలు వైజయంతి బ్యానర్ లో ఉంటాయి అని చెప్పేసాడు దీనితో ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది . ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన తర్వాత సినిమా కోసం కథలు వింటున్నాడు అదే సమయం లో అశ్వినీదత్ కలిసి నాగ్ అశ్విన్ దగ్గర ఒక మంచి కథ వుంది అని మీకు ఐతే చాల బాగుంటుంది అని చెప్పడం తో ప్రభాస్ సరే అని కథ తీసుకొని రమ్మన్నాడు.
నాగ్ అశ్విన్ చెప్పిన కథ ప్రభాస్ కి వెంటనే నచ్చేసింది , మార్పులు ఎం చెప్పకుండా వెంటనే నేను చేస్తాను అని చెప్పాడు . వెంటనే అనౌన్స్ చేసేసారు . ఈ సినిమా దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది అని సమాచారం , ఈ సంవత్సరం చివర నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది . అశ్వినిదత్ కి ఈ విషయం లో మంచి జరిగింది అనే చెప్పొచ్చు ఇంత బారి బడ్జెట్ సినిమాలకి ప్రస్తుతం ప్రభాస్ లాంటి హీరో తోనే బిజినెస్ చేయొచ్చు ప్రభాస్ కి వున్నా పాన్ ఇండియా మార్కెట్ బాగా కలిసి వస్తుంది . బడ్జెట్ కి ముందు వెనకాల చూసుకోవాల్సిన అవసరం లేదు . అన్ని భాషల్లో ఒక పెద్ద సినిమా లాగ రిలీజ్ చేసుకోవచ్చు . అశ్వినిదత్ కూడా ఈ విషయం లో చాల సంతోషంగా వున్నాడని తెలుస్తుంది . ఒకవేళ అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఐన ఎం పరవాలేదు సినిమా బాగా రావాలి అని నాగ్ అశ్విన్ కి చెప్పాడు అంట . మహానటి లాంటి గొప్ప సినిమా తీసిన నాగ్ అశ్విన్ , ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో కలయిక లో సినిమా అనగానే ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి . ఈ సినిమా బాహుబలి లాగ అన్ని బాషా లలో మరో సంచలనం సృష్టించే అవకాశాలు పుష్కలంగా వున్నాయి .