Home Blog Page 599

SSMB29 అనౌన్స్ మెంట్ అప్ డేట్ కి టైం ఫిక్స్ ?

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB 29. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు చేస్తుండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  

వి విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ బాబు పూర్తిగా క్రాఫ్, గడ్డంతో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని తన కెరీర్లో ఆయన ఇప్పటివరకు పోషించని ఒక డిఫరెంట్ పాత్రలో ఇందులో కనిపిస్తారని చెప్తున్నారు. 

మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకున్న అనంతరం గ్లోబల్ గా భారీ ఇమేజ్ అందుకున్న రాజమౌళి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న SSMB29 సినిమా 2027 సమ్మర్లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్. 

అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ అప్ డేట్ ని మార్చి 30న అనగా ఉగాది పండుగ నాడు అందిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ నెలలోనే అనగా ఏప్రిల్ లో SSMB29 కి సంబంధించి అనౌన్స్మెంట్ గ్లింప్స్ తో పాటు టైటిల్ కూడా రివీల్ కానుందని దానికి సంబంధించి త్వరలో టీం నుంచి ఒక ప్రకారం కూడా వెలువడనుందని చెప్తున్నారు. మరి అదే గనక నిజమైతే ఏప్రిల్ నెలలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ ఖాయమని చెప్పాలి

‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ 

0

టాలీవుడ్ యువ నటులు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీని యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. బీమ్స్ సిసిలోరియో సంగీతం అందించిన ఈ మూవీకి రాక్ స్టార్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. 

ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. మంచి యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా అందరినీ ఆకట్టుకుంటున్న మ్యాడ్ స్క్వేర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, హారిక, సాయి సౌజన్య నిర్మించారు. 

ఇక తమ మూవీ ఇంత పెద్ద విజయం అందుకోవడంతో ఇటీవల చిన్న సక్సెస్ పార్టీ చేసుకున్న టీమ్, ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విషయం ఏమిటంటే, మ్యాడ్ స్క్వేర్ మూవీ యొక్క సక్సెస్ మీట్ రేపు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగనుండగా టాలీవడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీనికి ప్రత్యేక అతిథిగా రానున్నారు. ఎన్టీఆర్ రానుండడంతో ఈ ఈవెంట్ కి భారీగా ఫ్యాన్స్ తరలిరానున్నారని, అందుకోసం ఏర్పాట్లు కూడా జాగ్రత్తగా చేస్తోందట మ్యాడ్ స్క్వేర్ టీమ్. 

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ రిలీజ్ డేట్ ఫిక్స్ 

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీలో సీనియర్ నటి వినాయశాంతి హీరో కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మాస్ సాంగ్ నాయల్ది బాగానే రెస్పాన్స్ అందుకుంది. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 18న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నట్లు నేడు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. 

ఇక ఈ మూవీలో తన తల్లి పాత్రలో నటించిన వైజయంతి గారి పాత్ర ఒకప్పటి ఆమె నటించిన కర్తవ్యంలో పాత్రని గుర్తు చేస్తుందని, అంత అద్భుతంగా నటించారని అంటోంది టీమ్. తమ సినిమా తప్పకుండా ఆడియన్స్ కి నచ్చడంతో పాటు తప్పకుండా ఇది 20 ఏళ్ళ పాటు అందరికీ గుర్తుండిపోతుందని తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తెలిపారు.

Karthi steps into Nani’s HIT franchise

0

HIT franchise started with Tollywood Actor, Vishwak Sen in the lead role produced by Actor Nani. The film became a big hit prompting a sequel. HIT 2 starred Adivi Sesh which also became a success. It featured Nani doing a cameo role at the end teasing his role in the HIT 3.

HIT 3 is now coming into the theatres on May 1st. There are high expectations on the film. Nani during the promotional activities recently mentioned that the team will be roping in Actors across various Industries for the upcoming films of the franchise. Likewise, the buzz is that the Kollywood Actor Karthi has been approached to play the lead role in HIT 4.

This is indeed a great move by the team and the franchise will start getting the Pan India appeal with this move. Karthi will also be a right choice for the genre and the theme and this film will have a bi-lingual effect as Karthi enjoys a good fanbase in Telugu States.

రికార్డు ధరకు అమ్ముడైన ‘పెద్ది’ ఆడియో రైట్స్

0

ఇటీవల శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజెర్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీని అనంతరం ఉప్పెన దర్శికుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పెద్ది. 

ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా వెంకట సతీష్ కిలారు దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. 

ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. కాగా విషయం ఏమిటంటే తాజాగా ఈ మూవీ యొక్క ఆడియో రైట్స్ ని ప్రముఖ ఆడియో సంస్థ టి. సిరీస్ వారు రూ. 25 కోట్లకు దక్కించుకున్నారు. 

కాగా ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ అని చెప్పాలి. మరోవైపు పెద్ది సినిమాని రాంచరణ్ ఫాన్స్ తో పాటు అన్ని వర్గాలు ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తుస్తున్నారని తప్పకుండా ఈ మూవీ రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకోవటం ఖాయం అంటోంది టీమ్. కాగా ఈ సినిమా 2026 మార్చి చివరలో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది

‘జాక్’ ట్రైలర్ : పెద్ద రిస్క్ 

0

ఇటీవల డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుని నటుడిగా తనకంటూ ఆడియన్స్ లో మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మూవీ జాక్. 

ఈ మూవీలో యువ అందాల కథానాయిక వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ మూవీని ప్రముఖ సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తునారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ పర్వాలేదనిపించగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. 

ముఖ్యంగా తన సినిమాల్లో లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ని దృష్టిలోపెట్టుకుని తెరకెక్కించే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, జాక్ విషయంలో మాత్రం ఒకింత రిస్క్ చేసి రా, ఇంటెలిజెన్స్ యాక్షన్ అంశాలు ప్రధానంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జాక్ ట్రైలర్ ని బట్టి మనం అది అర్ధం చేసుకోవచ్చు. 

ట్రైలర్ లో సిద్దు మార్క్ డైలాగ్స్ తో పాటు యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు బాగానే ఉన్నాయి. విజువల్స్ తో పాటు ఛేజింగ్, ఫైట్ సీన్స్ వంటివి ట్రైలర్ లో ఆకట్టుకుంటాయి. మొత్తంగా బాగానే ఉన్న జాక్ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ విధమైన కొత్త రిస్క్ తో భాస్కర్ ఎంతమేర విజయం అందుకుంటారో చూడాలి.  

మెగాస్టార్ – శ్రీకాంత్ ఓదెల మూవీ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా విశ్వంభర. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని యువి క్రియేషన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. 

త్వరలో రిలీజ్ డేట్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ టీం అందించనుంది. అయితే విషయం ఏమిటంటే దీంతోపాటు ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టారు మెగాస్టార్. అందులో ఒకటి అనిల్ రావిపూడి తో మూవీ కాగా మరొకటి శ్రీకాంత్ ఓదెల మూవీ. 

ఈ రెండు సినిమాల యొక్క అనౌన్స్మెంట్ ఇటీవల వచ్చాయి. తాజాగా అనిల్ రావిపూడి సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. విషయం ఏమిటంటే శ్రీకాంత్ ఓదెల సినిమాలో మెగాస్టార్ పాత్ర గతంలో ఆయన పోషించిన పలు యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ అంశాల కలబోతుగా ఉండనుందట. 

ఈ సినిమా గురించి తాజాగా న్యాచురల్ స్టార్ నాని ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారంటే కేవలం యాక్టింగ్, స్టైల్ అలానే పవర్ఫుల్ డాన్సులు మాత్రమే మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ, ఒకరకంగా ఆయన మనందరి ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు. 

ఈ రోజుల్లో మీరందరూ ఆయన నుండి ఏమి మిస్ అవుతున్నారో దానిని తిరిగి తీసుకురావడానికి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారని, తప్పకుండా ఆ మూవీ పెద్ద విజయం అందుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు నాని. త్వరలో ఈ సినిమా యొక్క షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా ?

0

ఇటీవల పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించారు. 

మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకుంది. నటుడిగా ఈ సినిమాతో ఎన్టీఆర్ మరింతగా మార్కెట్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ ప్రతిష్టాత్మక మాస్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ కూడా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ అయితే వేగవంతంగా జరుగుతోంది. త్వరలో ఎన్టీఆర్ ఈ సినిమా యొక్క షూట్లో పాల్గొన్నారు. దీనికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించి ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా అప్డేట్ వస్తుందనే న్యూస్ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆరోజున ఎన్టీఆర్ నీల్ టీం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్. రానున్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా పక్కాగా ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఉంటుందని అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు. 

కాగా ఈ సినిమాని జనవరి 2026 లో గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీం అయితే కసరత్తు చేస్తోంది. మరి తొలిసారిగా ఎన్టీఆర్, నీల్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీ ఎంత మేర విజయవంతం అవుతుందో చూడాలి. 

మెగాస్టార్ కి జోడీగా ఆ ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ ?

0

ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

దీని అనంతరం ఇప్పటికే అనిల్ రావిపూడి తో తన మూవీ యొక్క పూజా కార్యక్రమాలను జరిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుండగా దీనిని వేగవంతంగా పూర్తి చేసి 2026 సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఎంటర్టైన్మెంట్ యాక్షన్ కమర్షియల్ హంగులతో అదిరిపోతుందని దీనికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్స్ గా పరిణితి చోప్రా ,అదితి రావు హైదరి ల పేర్లు ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యాయని త్వరలో వీరిద్దరికి సంబంధించిన అనౌన్స్మెంట్ టీం నుంచి రానుందని చెప్తున్నారు. మొత్తంగా ఐదు పాటలు ఉండే ఈ సినిమాకి భీమ్స్ సిసిలోరియో అద్భుతమైన సాంగ్స్ అందిస్తుండగా ఇప్పటికీ మూడు సాంగ్స్ యొక్క కంపోజిషన్ పూర్తయిందట. 

ఓవరాల్ గా తనకిష్టమైన మెగాస్టార్ తో చేస్తున్న ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ విషయంలో పక్కాగా జాగ్రత్తలు తీసుకొని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని సాహూ గారపాటి తెలిపారు. తన బ్యానర్ పై ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. 

Nayanthara’s Test: Direct OTT Release, Streaming Tonight

0

Nayanthara, Madhavan and Siddharth gear up for a captivating human drama with their next project, Test. The OTT viewers can enjoy Nayanthara’s Test on OTT starting tonight. 

The film’s producers caught everyone off guard with the direct OTT release announcement. Nayanthara’s Test will be available for streaming on OTT starting tonight.

Netflix will offer the film in Tamil, Telugu, Malayalam, Kannada, and Hindi. The team’s confidence shone through in the interview, and the trailer for the film is engaging. 

In the thrilling world of cricket, Test depicts the heartfelt stories of a national-level cricketer, a talented scientist, and an enthusiastic teacher. Their journeys connect on and off the cricket field, shaping their future choices. The film, which further includes Meera Jasmine will stream on Netflix.

Nayanthara Test also Starring Madhavan and Siddharth Streaming Tonight on Netflix

YNOT Studios produces it. S. Sashikanth steps into directing while also writing the film.