నాగ శౌర్య ఛలో సినిమా కథ నాదే అని ఇప్పటికే చాల సార్లు చెప్పాడు . ఐతే ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల దీని మీద ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు , తాను ఎవరికీ ఇవ్వాల్సిన క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తా అని వాళ్ళు వద్దు అన్న ఇస్తా అని చెప్పాడు . ఇప్పుడు అశ్వథామ సినిమా ఫెయిల్ అవ్వడం అదే టైం లో భీష్మ సూపర్ హిట్ అవ్వడం తో సోషల్ మీడియా లో నాగ శౌర్య కామెంట్స్ ని ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పుడు భీష్మ హీరో నితిన్ కూడా నాగ శౌర్య ని స్టేజి మీద ట్రోల్ చేసాడు . భీష్మ సక్సెస్ మీట్ లో వెంకీ కుడుములు మాట్లాడిన తర్వాత మైక్ తీసుకొని ఈ కథ నువ్వే రాసావా , ఈ కథ నీదేనా అని నాగ శౌర్య కి సెటైర్ వేసాడు . స్టేజి మీద వున్నా అందరు నవ్వారు. దీనికి నాగ శౌర్య ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి . ప్రస్తుతానికి నాగ శౌర్య ఎన్నో ఆశలు పెట్టుకున్న అశ్వథామ ఫెయిల్ అవ్వడం తో డిప్రెషన్ లో వున్నాడు , ఇప్పుడు ఈ కామెంట్స్ కి ఎలా రెస్పొంద్ అవుతాడో చూడాలి .