గీతగోవిందం వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత డైరెక్టర్ పరశురామ్ చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఈ సినిమాకు నాగేశ్వరరావు
అనే టైటిల్ ఫిక్స్ చేసారు అని సమాచారం . ఈ సినిమాకి రష్మిక హీరోయిన్ గ ఫిక్స్ అయిందని అంటున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు . ప్రస్తుతం నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు , శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సాయి పల్లవి హీరోయిన్ గ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది .