పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయిక లో #PSPK27 సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే , ఏయం రత్నం ఈ భారీ బడ్జెట్ సినిమా ని నిర్మిస్తున్నాడు . ఈ సినిమా కోసం హీరోయిన్స్ వేట ఇంకా కొనసాగుతూనే వుంది అని సమాచారం. హిందీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ హీరోయిన్స్ ఐతే మూవీ కి క్రేజ్ వస్తుంది అని వాళ్ళ కోసం ప్రయత్నించారు కానీ కారణాలు ఏమిటో తెలీవు ఎవరు ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోవట్లేదు అంట . ఇది ఇలా ఉండగా ప్రొడ్యూసర్ దగ్గర ఇంత బారి బడ్జెట్ పెట్టడానికి డబ్బులు లేవు అని సమాచారం .అందుకని ముందుగానే తెలుగు , హిందీ శాటిలైట్ హక్కులు , డిజిటల్ హక్కులు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు అంట. ఈ హక్కుల తో వచ్చిన డబ్బులతో సినిమా స్టార్ట్ చేసి ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్ తో మిగతా సినిమా పూర్తీ చేయొచ్చు అని భావిస్తున్నాడు అంట .
ఈ సినిమా కోసం కళ్యాణ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు . ఈ సినిమా కి విరూపాక్ష టైటిల్ ఐతే బాగుంటుంది అని క్రిష్ భావిస్తున్నాడు . సినిమా ని మొదట సంక్రాంతి కి రిలీజ్ చేయాలనుకున్నారు . ఇప్పుడు RRR వస్తుంది కాబట్టి సంక్రాంతి కీ రిలీజ్ చేస్తారా లేదా డేట్ మార్చుకుంటార అనేది చూడాలి . మెగా అభిమానులతో పాటు సినిమా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు .