ప్రస్తుతం నాగ చైతన్య , లవ్ స్టోరీ షూటింగ్ లో బిజీ గా వున్నాడు . శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సాయి పల్లవి హీరోయిన్ గ ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా ని మే 22 రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు . ఈ సినిమా తర్వాత గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ తో సినిమా కి కమిట్ అయ్యాడు . 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమా ని నిర్మిస్తుంది. ఐతే ఇప్పుడు పరశురామ్ కి మహేష్ నుండి పిలుపు రావడం తో మహేష్ కి స్క్రిప్ట్ రెడీ చేసే పని లో బిజీ అయిపోయాడు. ఒకవేళ పరశురామ్ మహేష్ ని ఇంప్రెస్స్ చేస్తే నాగచైతన్య తో ఇప్పుడే సినిమా చెయ్యడం కష్టం . నాగచైతన్య పరశురామ్ తో తన తర్వాత సినిమా ఉంటుంది అని ఇంకా ఎవరికీ కమిట్మెంట్స్ ఇవ్వలేదు .
ఇప్పుడు పరశురామ్ మహేష్ దగ్గరికి వెళ్లిపోవడంతో నాగచైతన్యతో సినిమా తీయడానికి దర్శకులు తిరుగుతున్నారు. వీరిలో అజయ్ భూపతి పేరు బాగా వినిపిస్తుంది ఎప్పటినుండో నాగచైతన్య తో సినిమా చేద్దామని అజయ్ భూపతి తిరుగుతున్నాడు కానీ నాగచైతన్య డేట్స్ కాలిగా లేకపోవడంతో ఇప్పట్లో కష్టం అనుకున్నాడు. ఇంకా నాగచైతన్య తర్వాత ఎవరికి కమిట్ అవ్వకపోవడంతో స్క్రిప్ట్ రెడీ చేసే పని లో బిజీ గ వున్నాడు అజయ్ భూపతి . నాగచైతన్య ని కలిసి ఒకేసారి ఫుల్ నరేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఐతే ఇప్పటికి పరశురామ్ నాగచైతన్య కి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అని సమాచారం.