HomeMovie News'కూలీ' కి తెలుగులో కూడా మంచి క్రేజ్

‘కూలీ’ కి తెలుగులో కూడా మంచి క్రేజ్

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్ సంస్థపై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి చికితు వైబ్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తోపాటు శంబు తండ్రి టి రాజేంద్రన్ సహా మరికొంతమంది తో కలిసి చిందేస్తూ ఇంట్రెస్టింగ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి ఆదరణ అయితే అందుకుంటుంది.

అనిరుద్ తో కలిసి టి రాజేందర్ తదితరులు అద్భుతంగా ఆలపించిన ఈ సాంగ్ మొత్తంగా సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచింది. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్స్ లో పలు భాషలు ఆడియన్స్ ముందుకు రానుంది కూలీ మూవీ. మరోవైపు అదే రోజున ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల వార్డు కూడా రిలీజ్ కావడంతో ఒకింత కూలీపై కూడా బాక్సాఫీస్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది.

ఐతే కూలీ మూవీ యొక్క తెలుగు రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడు కావడంతో దీనికి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ మంచి రేంజ్ లో ఉందని అర్ధం అవుతోంది. స్టార్ హీరో నాగార్జున ఉండడం ఇక్కడ మంచి ప్లస్ అని తప్పకుండా కూలీ కంటెంట్ కనెక్ట్ అయితే పెద్ద విజయం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 

See also  'కూలీ' హిందీ వర్షన్ టైటిల్ కి షాకింగ్ రెస్పాన్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories