2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగార్జున చేసిన సందడి అందరికి తెలిసిందే . నాగార్జున కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్బస్టర్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన , 50 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి సీనియర్ హీరోస్ కే ఒక మైలురాయి గ నిలిచింది. ఈ సినిమా కి కళ్యాణ్ కృష్ణ చేశాడు . ఆ తర్వాత ఈ సినిమా కి సీక్వెల్ చెయ్యాలని అనుకున్నారు కానీ కథ రెడీ అవ్వలేదు . కళ్యాణ్ కృష్ణ ఈ కథ కోసం చాల నెలల నుండి వర్క్ చేస్తున్నాడు ఐతే తాజా సమాచారం మేరకు ఈ సినిమా కథ అంత రెడీ అయిపోయింది అంట . జులై చివరలో మొదలు పెట్టి , మళ్ళీ సంక్రాంతి కే రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.
ఈ సినిమా లో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా కలిసి నటిస్తున్నాడు , సినిమా అంత నాగచైతన్య పాత్ర చుట్టే తిరుగుతుంది అని సమాచారం , సినిమా లో ఎక్కువ భాగం నాగ చైతన్య నే ఉంటాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ షూటింగ్ లో బిజీ గ వున్నాడు . నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో బిజీ గ వున్నాడు . ఈ రెండు సినిమాలు సమ్మర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. 2016 లో సంక్రాంతి వచ్చి సందడి చేసిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ 5 ఏళ్ళ తర్వాత మల్లి సంక్రాంతి కీ వస్తుంది , ఈసారి ఎంత సందడి చేస్తుందో చూడాలి .