Home Movie News ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సెన్సార్ రిపోర్ట్ 

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సెన్సార్ రిపోర్ట్ 

arjun son of vyjayanthi

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. 

ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి కీల పాత్ర చేస్తుండగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ పర్వాలేదనిపించగా నేడు మూవీ నుండి ముచ్చటగా బంధాలే అనే పల్లవితో సాగే సాంగ్ ని తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ లో రిలీజ్ చేసారు. 

ఈ సాంగ్ మదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ ని తెలిపేదిగా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఈ నెల 18న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

 తాజాగా సెన్సార్ వారి నుండి యు / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. ల 24 నిముషాలుగా ఉంది. తప్పకుండా తమ మూవీ అందరి అంచనాలు అందుకుని మంచి విజయం సాదిస్తుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version