సినిమాలు హిట్స్ అవుతాయి ,బ్లాక్బూస్టర్స్ అవుతాయి కానీ కొన్ని సినిమాలే చరిత్ర ని తిరగరాస్తాయి.ఆ సినిమా కోసం ప్రతి హీరో ఎప్పుడు వస్తదా అని ఎదురు చూస్తూ వుంటారు. అల్లు అర్జున్ అలానే ఎదురు చూసాడు హిట్స్ , సూపర్ హిట్స్ , బ్లాక్బూస్టర్స్ అన్ని కొట్టాడు అల్లు అర్జున్ ఒక్క ఇండస్ట్రీ హిట్ ఎప్పుడు కొడతామా అని చుసిన అల్లు అర్జున్ కి అల వైకుంఠపురంలో సినిమా తో తన కోరిక తీరింది . అన్ని నాన్ బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టాడు . తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా బాహుబలి1 ని కొట్టి చరిత్ర సృష్టించాడు . ఓవర్సీస్ లో కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా . తెలుగు సినిమాలో ఒక ఇండస్ట్రీ హిట్ వస్తే కొన్ని నెలలు అలానే ఉండిపోతుంది కానీ అల వైకుంఠపురంలో సైరా రికార్డ్స్ ని మూడు నెలలకే పరిమితం చేసింది . 150 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి నాన్ బాహుబలి సినిమా గా అల వైకుంఠపురం లో రికార్డు క్రియేట్ చేసింది .ఈ రోజుతో అల వైకుంఠపురరములో 50 రోజులు పూర్తి చేసుకుంది .
థమన్ ఇచ్చిన పాటలతో రిలీజ్ కి ముందే విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసింది మూవీ , రిలీజ్ రోజు సూపర్ హిట్ టాక్ రావడం తో ఈ సినిమా కలెక్షన్స్ ఎవరు ఊహించని స్థాయి లో నిలబడిపోయాయి . ఎన్నో మైలురాయిలను ఈ సినిమా ని అందుకుంది బాహుబలి1 మొదటి వారం రికార్డు ని బద్దలు కొట్టిన మొదటి సినిమా ఇదే , అలాగే తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి౧ ని రికార్డ్స్ ని బద్దలు కొట్టిన మొదటి సినిమా ఇదే . త్రివిక్రమ్ కి ఇది రెండవ ఇండస్ట్రీ హిట్ , అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ కి ఒక స్టార్ హీరో తో భారీ సక్సెస్ రాలేదు . అలా వైకుంఠపురంలో తో మళ్ళీ అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ సక్సెస్ ని కొట్టాడు త్రివిక్రమ్ . ఈ సినిమా లో పూజ హెగ్డే కథానాయకి గ నటించింది , నవదీప్ , సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. అలా వైకుంఠపురంలో సినిమా ఒక చరిత్ర , ఈ చరిత్ర ని మళ్ళీ ఎవరు తిరగరాస్తారో చూడాలి