Home Movie News భీమ్లా నాయక్ సినిమా హీరోగా ముందు పవన్ కళ్యాణ్ ను అనుకోలేదా?

భీమ్లా నాయక్ సినిమా హీరోగా ముందు పవన్ కళ్యాణ్ ను అనుకోలేదా?

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా తర్వాత పవన్ పలు సినిమాలతో బిజీగా అయ్యారు. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లులో నటిస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో భీమ్లా నాయక్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.

ఆ ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. బాలయ్య టాక్ షో అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా సెకండ్ ఎపిసోడ్‌కు యువ నటులు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా విచ్చేయగా, నిర్మాత నాగవంశీ కూడా హాజరయ్యారు.

ఆ ఎపిసోడ్‌లో భీమ్లా నాయక్‌ సినిమాలో హీరోగా మొదట ఎవరిని అనుకున్నారు అని బాలకృష్ణ వంశీని ప్రశ్నించారు. వంశీ నవ్వుతూ మీరే కదా సార్ అన్నారు. బాలకృష్ణ భీమ్లా నాయక్ ప్రధాన పాత్ర కోసం పరిగణించబడ్డారట. మరియు ఆయనతో ఈ విషయమై చాలా చర్చలు కూడా జరిగాయట. అయితే భీమ్లా నాయక్ కోసం బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారట.

టాక్ షో సందర్భంగా వంశీ ఈ వార్తను వెల్లడించడంతో, ప్రేక్షకులు అరుపులు చప్పట్లతో స్పందన ఇచ్చారు. ఈ వార్త విన్న తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. బాలకృష్ణ ఆ పాత్ర చేసి ఉంటే అదిరిపోయేది అని నందమూరి అభిమానులు మరియు ఇతర సాధారణ ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో నుంచి మరో హీరోకి సినిమాలు మారడం మామూలే. కొన్ని సినిమాలకు అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా హీరోని మార్చిన సంఘటనలు ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో రూపొందించిన భీమ్లా నాయక్.. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

కాగా భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై మంచి స్పందనను అందుకుంది. పవర్ స్టార్ అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది కానీ భారీ ఓపెనింగ్స్ తర్వాత సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ముగిసింది.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version