Home Movie News ఓటిటి లోకి వచ్చేసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 

ఓటిటి లోకి వచ్చేసిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 

tourist family

శశి కుమార్, సిమ్రాన్ జంటగా యువ దర్శకుడు అబీషన్ జీవింత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ తమిళ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. ఆర్ధిక పరిస్థితుల రీత్యా శ్రీలంక నుండి ఇండియాకి వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ఇక్కడ ఏవిధంగా జీవించింది, అనంతరం ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కథాంశంతో ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు దీనిని తెరకెక్కించారు. 

మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎం ఆర్ పి ఎంటర్టైన్మెంట్ సంస్థలు దీనిని గ్రాండ్ గా నిర్మించగా ఇతర కీలక పాత్రల్లో మిథున్ జయ శంకర్, కమలేష్, యోగిబాబు తదితరులు నటించారు. అయితే ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అతి పెద్ద విజయం అందుకుంది.

ముఖ్యంగా మనుషుల మధ్యన అంతరించిపోతున్న బంధాలు, అనుబంధాల నేపథ్యంలో ఆకట్టుకునే రీతిన దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీకి ఆడియన్స్ నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సు ని ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ జియో హాట్ స్టార్ ద్వారా ఓటిటిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది.

తప్పకుండా తమ మూవీ ఓటిటి లో కూడా అందరినీ ఆకట్టుకుంటుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి ఓటిటి లో టూరిస్ట్ ఫ్యామిలీ ఎంతమేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version