HomeMovie Newsకమల్ రిస్క్ తో ఫైనాన్షియల్ లాస్ లో 'థగ్ లైఫ్'

కమల్ రిస్క్ తో ఫైనాన్షియల్ లాస్ లో ‘థగ్ లైఫ్’

- Advertisement -

తాజాగా కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తడికెక్కిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా థగ్ లైఫ్. శింబు మరొక కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో అభిరామి, తనికెళ్ల భరణి, నాజర్ కూడా ముఖ్య పాత్రలు చేశారు.

అయితే మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి ఘోరంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. కమల్ హాసన్, మణిరత్నంలో కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావటంతో అందరిలో కూడా దీని పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనాలతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయింది. విషయం ఏమిటంటే దానితో ఈ సినిమాని త్వరలో ఓటీటిలో తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.

వాస్తవానికి ఈ సినిమా హిందీ బెల్ట్ లో కూడా రిలీజ్ అయిన ఓటిటి డీల్ ప్రకారం 8 వారాల అనంతరమే డిజిటల్ ఆడియన్స్ ముందుకు రావాలి. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ నాలుగు వారాల్లోనే నెట్ ఫ్లిక్స్ లో లో ఇది అందుబాటులోకి రానుండడంతో ఆ సంస్థ 20 కోట్లు డీల్ అమౌంట్ ని కట్ చేసినట్టు తెలుస్తోంది.

See also  'థగ్ లైఫ్' : అందరి అంచనాలు అందుకునేనా ?

అలానే నేషనల్ మల్టీప్లెక్స్ సంస్థలు కూడా థగ్ లైఫ్ టీం కి ఈ విషయమే కొంత ఫైన్ వేశారు. ఓవరాల్ గా థగ్ లైఫ్ మూవీ అటు బాక్సాఫీస్ వద్ద పరాజయంతో పాటు త్వరగా ఓటిటి రిలీజ్ అవ్వటంతో ఈ విధంగా భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories