HomeMovie Newsఓటిటి లోకి వచ్చేసిన తుడరుమ్, రెట్రో, హిట్ 3

ఓటిటి లోకి వచ్చేసిన తుడరుమ్, రెట్రో, హిట్ 3

- Advertisement -

తాజాగా మోహన్ లాల్ నటించిన తుడరుమ్, సూర్య నటించిన రెట్రో, నాని నటించిన హిట్ 3 సినిమాలు మూడు కూడా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. 

మోహన్ లాల్, శోభన కీలకపాత్రలో తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తుడరుమ్ సినిమా ఓవరాల్ గా థియేటర్స్ లో భారీ విజయం అందుకుని రూ. 230 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుంది. అంతకుముందు ఎంపురాన్ మూవీతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు మోహన్ లాల్.

తాజాగా తుడరుమ్ సినిమా జియో హాట్ స్టార్ లో పలు భాషలు ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరోవైపు సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్ సినిమా రెట్రో.

ఇటీవల థియేటర్స్ లో 100 కోట్ల వరకు గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చింది. అలానే న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 మూవీ కూడా థియేటర్స్ లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది.

See also  'థగ్ లైఫ్' : అందరి అంచనాలు అందుకునేనా ?

తాజాగా ఈ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొత్తంగా ఈ మూడు సక్సెస్ ఫుల్ సినిమాలు ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. మరి ఇవి ఎంత మేర వారి యొక్క ఆదరణని అందుకుంటాయో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories