HomeMovie News'హరి హర వీర మల్లు' రిలీజ్ కి సరైన డేట్స్ ఇవే 

‘హరి హర వీర మల్లు’ రిలీజ్ కి సరైన డేట్స్ ఇవే 

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలిసి తెరకెక్కిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు పార్ట్ వన్. ఈ సినిమాలో బాబి డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలకపాత్రలు చేస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా నుంచి ఇప్పటికే మూడు గ్లింప్స్ టీజర్లు మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యి మూవీ పై ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో జస్ట్ పర్వాలేదనిపించే  రెస్పాన్స్ మాత్రమే ఏర్పరిచాయి. ఇక ఈ సినిమా జూన్ 12న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ బ్యాలెన్స్, అనేక ఏరియాల బిజినెస్ ఇంకా పూర్తికాని కారణంగా దీన్ని వాయిదా వేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ 20న కుబేర, 27న కన్నప్ప, జులై 4న తమ్ముడు, జూలై 11న ఘాటి, 25న కింగ్డమ్ సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి. మరోవైపు ఆగస్టు 14న వార్ 2 తో పాటు కూలీ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. అదే నెల 27న రవితేజ మాస్ జాతర కూడా రిలీజ్ కానుంది. 

అలానే మిరాయ్ కూడా 5 సెప్టెంబర్ న రిలీజ్ కానుంది. మొత్తంగా రానున్న ఈ రెండు నెలలు కూడా వరుస సినిమాలతో డేట్స్ లాక్ చేయబడి ఉన్నాయి. అయితే వీటిలో జూలై 18 లేదా ఆగస్టు 1 ఈ రెండు డేట్స్ మాత్రమే హరిహర వీరమల్లు రిలీజ్ కి ఒకింత పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి. మరోవైపు జూలై 18 సినిమా పక్కగా రిలీజ్ ఖాయం వార్తలు కూడా ఊపు అందుకున్నప్పటికీ పక్కాగా హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

See also  'హరి హర వీర మల్లు' రిలీజ్ ఈ నెలలో లేనట్లేనా ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories