Home Movie News ‘కూలీ’ హిందీ వర్షన్ టైటిల్ కి షాకింగ్ రెస్పాన్స్

‘కూలీ’ హిందీ వర్షన్ టైటిల్ కి షాకింగ్ రెస్పాన్స్

coolie hindi

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ సినిమా కూలీ. శృతిహాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అన్ని భాషల ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఆగస్టు 14న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే కూలీ సినిమాకి హిందీ వర్షన్ లో మజ్దూర్ గా టైటిల్ ని ఫిక్స్ చేసారు. గతంలో కూలీ టైటిల్ తో 1983లో అమితాబచ్చన్ హీరోగా ఒక సినిమా వచ్చింది. అలానే గోవిందా నటించిన కూలి నెంబర్ వన్ 1995లో రాగా వరుణ్ ధావన్ నటించిన కూలీ నెంబర్ వన్ కూడా 2020లో వచ్చింది.

కాబట్టి ఇదే టైటిల్ హిందీలో పెట్టడం సరికాదని భావించిన మేకర్స్ మజ్దూర్ ని హిందీలో ఫిక్స్ చేశారు. అయితే ఈ టైటిల్ కరెక్ట్ కాదని దీనిపై పలువురు హిందీ ఆడియన్స్, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఆగస్టు 14న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 మూవీ కూడా విడుదల కానుండడంతో ఈ రెండు సినిమాలపై అందరిలో భారీ స్థాయి క్యూరియాసిటీ ఏర్పడింది. మరి ఓవరాల్ గా రిలీజ్ అనంతరం కూలీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version