Home Movie News వరుస లైనప్స్ తో బిజీ బిజీగా విక్టరీ వెంకటేష్

వరుస లైనప్స్ తో బిజీ బిజీగా విక్టరీ వెంకటేష్

venkatesh

ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ పరంగా అతిపెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెట్టారు. అనిల్ రావిపూడి తీసిన ఆ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో కొన్నేళ్ల అనంతరం మరొక్కసారి తన మార్క్ కామెడీతో అందరినీ ఆకట్టుకున్నారు వెంకటేష్.

అయితే దాని అనంతరం వెంకీ అప్ కమింగ్ లైనప్ చూసుకుంటే ముందుగా ఆగస్టులో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేయనున్న ఫ్యామిలీ యాక్షన్ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు తాజాగా అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు వెంకటేష్.

ఇక ఈ రెండు సినిమాల అనంతరం అతి త్వరలో దృశ్యం 3 కూడా ప్రారంభించనున్నారు వెంకటేష్. ఇక ఈ మూడు సినిమాలపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

వీటి అనంతరం సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అయిన మళ్లీ సంక్రాంతి వస్తున్నాం సినిమా కూడా చేయనున్నారు వెంకటేష్. మొత్తంగా సీనియర్ హీరోలు అందరిలో కూడా వరుసగా సినిమాలను ఎంచుకుంటూ బిజీబిజీగా కెరియర్ పరంగా కొనసాగుతున్నారు విక్టరీ వెంకటేష్. మరి ఈ సినిమాలు అన్ని కూడా ఆయనకి నటుడిగా ఏ స్థాయి సక్సెస్ అందిస్తాయో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version