Home Movie News తెలుగులో రూ. 100 కోట్ల క్లబ్ కి రీచ్ అవుతోన్న ‘కుబేర’

తెలుగులో రూ. 100 కోట్ల క్లబ్ కి రీచ్ అవుతోన్న ‘కుబేర’

kuberaa

కింగ్ నాగార్జున, ధనుష్, నేషనల్ రష్మిక మందన్న కలయికలో సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల కలిసి గ్రాండ్ గా నిర్మించిన సినిమా కుబే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి నుంచి మంచి అంచనాలు ఏర్పరచింది. ఇటీవల రిలీజ్ డే నుండే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈమూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది.

ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన కుబేర కి అన్నివర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందటతో టీం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే గడిచిన నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ. 65 కోట్లకు పైగా గ్రాస్ సొంతం చేసుకొని అతి త్వరలోనే తెలుగు వర్షన్ పరంగా రూ. 100 కోట్లకు చేరుకునే దిశగా కొనసాగుతోంది.

అయితే తమిళ్ లో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మన్స్ చేయడం లేదు. సోమవారం నుంచి ఈ సినిమా తమిళ్ లో చాలావరకు డ్రాప్ అయింది. మొత్తంగా తమిళనాడులో కుబేర సినిమా రూ. 25 కోట్ల వద్ద క్లోజ్ అయ్యే టువంటి అవకాశం కనపడుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక ల పెర్ఫార్మన్స్ తో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల టేకింగ్ కి మంచి ప్రసంశలు కురుస్తున్నాయి. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version