Home Movie News Salaar VS Pushpa 2: ప్రీ రిలీజ్ బిజినెస్ లో సాలార్ Vs పుష్ప 2

Salaar VS Pushpa 2: ప్రీ రిలీజ్ బిజినెస్ లో సాలార్ Vs పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పుష్ప 2, సాలార్ చిత్రాల్లో నటిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు తమ సినిమాలను ఒకే తేదీ లేదా ఒకే సీజన్ లో విడుదల చేసినప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుంటారు. అయితే ఆసక్తికరమైన పరిణామంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలు విడుదల కాకుండానే పోటీ పడుతున్నారు.

ఓ వైపు అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘పుష్ప’ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకులలో భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. మరో వైపు ప్రభాస్ సాలార్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్, బాహుబలి హీరో నుంచి వస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది.

ఈ రెండు సినిమాలు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త బెంచ్ మార్క్స్ క్రియేట్ చేస్తూ అన్ని ఏరియాల్లో పోటీ పడుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బిజినెస్ ఎంత అనేది ఖచ్చితమైన లెక్కలు తెలియనప్పటికీ ఈ రెండు సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, ఫైనల్ ప్రీ బిజినెస్ లో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో వేచి చూడాల్సిందేనని అంటున్నారు.

ఇటీవలే పుష్ప 2 గ్లింప్స్ ని నిర్మాతలు రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. సాలార్ చిత్ర బృందం కూడా తమ సినిమాకు సంబంధించిన ఓ షార్ట్ గ్లింప్స్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ వంటి స్టార్స్ నటిస్తుండగా, సాలార్ లో ప్రభాస్ సరసన శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో జగపతిబాబు కనిపించనుండటం మరో విశేషం.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version