HomeMovie News'హరి హర వీర మల్లు' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రేపు ?

‘హరి హర వీర మల్లు’ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రేపు ?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరి హర వీర మల్లు ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కి రెడీ అయిన విషయం తెల్సిందే. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో గజ దొంగ వీర మల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. 

ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో బాబీ డియోల్, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి నటిస్తున్నారు. 

మొత్తంగా అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన ఈ మూవీ వాస్తవానికి ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో బిజినెస్ ఇంకా హోల్డ్ లో ఉన్న కారణంతో పాటు కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ కారణంగా రిలీజ్ వాయిదా వేసినట్లు టీమ్ ఇటీవల వెల్లడించింది. 

అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈమూవీ యొక్క రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రేపు రానున్నట్లు టాక్. అనంతరం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటన రానుందట. కాగా హరి హర వీర్ అమలు జులై 18 లేదా 25 న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి టీమ్ ఏ డేట్ అనౌన్స్ చేస్తుందో చూడాలి.

See also  'హరి హర వీర మల్లు' రిలీజ్ కి సరైన డేట్స్ ఇవే 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories