Home Movie News Chiru152 2021 Summer Release ??

Chiru152 2021 Summer Release ??

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఇప్పటికే చాల కారణాల వాళ్ళ లేట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే . భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల ఇంకో సినిమా చెయ్యలేదు చిరంజీవి సైరా మూవీ లేట్ అవ్వడం తో కొరటాల ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ చెయ్యలేకపోయాడు. సైరా మూవీ తర్వాత మల్లి స్క్రిప్ట్ లో చేంజెస్ చెయ్యాలని చిరంజీవి చెప్పడం తో ఇంకా లేట్ అవుతా వస్తుంది ఈ సినిమా . అన్ని ఒకే అనుకోని ఎలా ఐన ఈ సినిమా ని ఆగష్టు 14 రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆగష్టు లోనే కాదు ఈ సంవత్సరం లోనే రిలీజ్ ఉండదు అని అంటున్నారు కారణం ఏంటి అంటే ఈ సినిమా లో చరణ్ – చిరంజీవి కాంబినేషన్ సీన్స్ వున్నాయి చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ గ వున్నాడు ఈ సినిమా ని 2021 సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాతే చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంట , ఈ సినిమా మార్చ్ 2021 లో రిలీజ్ అవ్వొచ్చు అని సమాచారం. ఆచార్యా అనే టైటిల్ ఈ సినిమా కి అనుకుంటున్నారు. కొరటాల – చిరంజీవి కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేసేవాళ్ళు ఇంకో సంవత్సరం వెయిట్ చెయ్యక తప్పని పరిస్థితి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version