Home Movie News హరీష్ సొంత కథతో హిట్ తీస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోత : బండ్ల గణేష్

హరీష్ సొంత కథతో హిట్ తీస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోత : బండ్ల గణేష్

ఇటీవల పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకోవడం తో చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకి, తోటి టేక్నిషియన్స్ కు ట్విట్టర్ నీ వేదిక గా చేసుకొని ధన్యవాదాలు తెలియజేయటం జరిగింది. ఇందులో సినిమా నిర్మాత బండ్ల గణేష్ పేరు లేకపోవటం గమనార్హం.

దీని గురించి బండ్ల గణేష్ నీ ఒక ఇంట్వ్యూలో అడగగా, అది ఆయన సంస్కారం, హరీష్ శంకర్ కి రీమేక్ సినిమాలు తియ్యటం తప్ప ఏమీ రాదని, సొంతంగా కథ రాసుకొని సినిమా నీ హిట్ చేస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోత అని ఘాటుగా స్పందించాడు.

సినిమాలు లేక ఖాళీగా ఉన్న సమయం లో పవన్ కళ్యాణ్ నీ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చింది నేను అని అదే కాకుండా ఎన్టీఆర్ తో సినిమా ఇప్పిస్తా అని చెప్పి నల్లమలుపు బుజ్జి ఇప్పించకపోవటం తో డిప్రెషన్ లోకి పోయినప్పుడు ఫాం హౌస్ కి వెళ్లి మిరపకాయ్ కథ వినిపించింది నేను అని చాలా ఘాటుగా స్పందించాడు.

దీని పై హరీష్ శంకర్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version