కరోనా తరువాత సినీ పరిశ్రమ అనుసరించాల్సిన విధానం పై ఇటీవల చిరంజీవి ఇంట్లో, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన నాగార్జున, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు దిల్ రాజు, సి. కళ్యాణ్, సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ సమావేశం అయ్యారు.
మా అభ్యర్థనలను మంత్రి గారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు, సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించినట్లు మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళు అందరూ చెప్పుకొచ్చారు.
ఇంతవరకు అంతా బానే ఉంది కానీ ఈరోజు బాలకృష్ణ మాట్లాడుతూ నన్ను అసలు ఎవరు పిలవలేదు అని షూటింగ్ లు వాళ్ళ కేన మాకు ఉండవా, వాళ్ళు అక్కడ కూర్చొని సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతున్నాం అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని ధ్వజం ఎత్తాడు.
సినీ పరిశ్రమ లో పనిచేసే రోజు వారి కూలీల కోసం సేకరించ తలపెట్టిన విరాళాలకి కూడా బాలకృష్ణ అందరికంటే ముందు స్పందించి 25 లక్షలు విరాళం ప్రకటించారు, గత మూడు దశాబ్దాలుగా పరిశ్రమ లో ఉంటున్న బాలకృష్ణ ను ఇటువంటి ముఖ్యమైన సమావేశాలకు పిలవకపోవడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
చిరంజీవి తనను తాను ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుల మలుచుకోటానికే ఇలా ముఖ్యమైన సమావేశాలకు పక్కవాల్లని దూరం పెడుతున్నాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యల పై నిర్మాత సి.కళ్యాణ్ స్పందిస్తూ బాలకృష్ణ నిర్మాత కాకపోవడం వల్ల మీటింగ్ కి ఆహ్వానించలేదు అని బదులిచ్చారు. దీనికి నెటిజన్లు చిరంజీవి, నాగర్జున నిర్మాతల, బాలకృష్ణ కి కూడా నిర్మాణ సంస్థ ఉంది అని సినిమాలు నిర్మించాడు అని విమర్శలు గుప్పిస్తున్నారు.
దీని పై చిరంజీవి, నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.