HomeMovie Newsఒకే స్టేజ్ పై అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి

ఒకే స్టేజ్ పై అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి

- Advertisement -

టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో AA 22 మూవీ షూటింగ్ ముంబైలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనె హీరోయిన్ గా నాట్టిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. అయితే నేడు గద్దర్ అవార్డుల వేడుక హైదరాబాద్ లో జరుగనుండడంతో ఆయన ముంబై నుండి హైదరాబాద్ రానున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల కొన్నాళ్ల క్రితం జరిగిన ఒక ఈవెంట్ లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆయన పై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుపెట్టాయి. దానిపై స్పందించిన కేటిర్, కావాలని అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు.

అనంతరం పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ విచ్చేయడంతో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. దానితో అల్లు అర్జున్ పై కేసు నమోదవడం, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వం మొత్తం ఆయన పై గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది.

ఆ తరువాత అల్లు అర్జున్ అరెస్ట్ అవడం, ఆపై బెయిల్ పై బయటకు రావడం కూడా జరిగింది. కాగా నేడు గద్దర్ అవార్డుల ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పుష్ప 2 మూవీకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆ వివాదాల అనంతరం అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి లు ఒకే స్టేజ్ పై ఈ కలయిక అంతటా చర్చనీయాంశంగా మారింది. 

See also  అల్లు అర్జున్ - అట్లీ మూవీలో దీపికా పదుకొనె 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories