HomeMovie Newsషో టైం చేంజ్ అంటున్న ది వారియర్

షో టైం చేంజ్ అంటున్న ది వారియర్

- Advertisement -

రామ్ హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ది వారియర్. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాతో రామ్ తన కెరీర్ లోనే మొట్ట మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చిత్ర యూనిట్ విడుదల చేసిన పబ్లిసిటీ మెటీరియల్ అయిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్స్ ను బట్టి పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచి రేట్లకు జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 44 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1280 థియేటర్లలో విడుదలవుతోంది.

See also  బిల్ గేట్స్ తో సూపర్ స్టార్

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సినిమాల మొదటి షోలు తొందరగా ప్రదర్శించే అలవాటు చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా క్రేజ్ ను బట్టి ఆయా చిత్ర యూనిట్ అధిక షోలకు అనుమతి తెచ్చుకుని ప్రదర్శించటం ఒక ఆనవాయితీగా వస్తుంది.

అయితే ఆర్ ఆర్ ఆర్, కేజీఫ్ – 2 వంటి భారీ సినిమాలకి లేదా అగ్ర హీరోల సినిమాలకి ఆ అవసరం ఉంటుంది కానీ ఇతర మాస్ చిత్రాలకు ఆ అవసరం ఉండదు. ఐతే అలాంటి స్పెషల్ షోలు కాక పోయినా సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పొద్దున ఎనిమిది గంటలకు షో పడటం మామూలే. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రసాద్స్ థియేటర్ లో 8:45 షో చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ది వారియర్ సినిమాకు మాత్రం అలాంటి ప్రీమియర్ లు ఉండవు అని.. కాస్త ఆలస్యంగా అంటే 9:30 సమయానికి సినిమా ప్రదర్శన మొదలవుతుంది అని తెలుస్తుంది.

See also  ఆంధ్రప్రదేశ్: థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకున్న ఎగ్జిబిటర్లు

భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు నుంచి కూడా మంచి ప్రచారం జరగడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories