Home Movie News వార్ 2 vs కూలీ : 8 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ 

వార్ 2 vs కూలీ : 8 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ 

war 2 coolie

ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తీసిన వార్ 2 తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన కూలీ సినిమాలు రెండూ కూడా ఒకేరోజున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే వీటిలో వార్ 2 మొదటి రోజు నుండి నెగటివ్ టాక్ సొంతం చేసుకోగా కోలీ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ రెండు సినిమాల్లో కూలీ మూవీ ఓపెనింగ్స్ పరంగా రూ. 150 కోట్లమేర రాబట్టింది. ఇక ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అయితే పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా వార్ 2 అయితే చాలా చోట్ల చతికల పడగా కూలీ అక్కడక్కడా పర్వాలేదన్పిస్తోంది. ఇక అసలు విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాల యొక్క 8 రోజుల కలెక్షన్ పరిశీలిస్తే కూలీ రూ. 435 కోట్లని రాబట్టగా వార్ 2 మూవీ రూ. 302 కోట్లు రాబట్టింది. వీటిలో కూలీ మూవీ మొత్తంగా రూ. 600 కోట్లు రాబడితేనే బ్రేకీవెన్ ని చేరుకుంటుంది.

కాగా వార్ 2 మూవీ రూ. 700 కోట్లు బ్రేకీవెన్ రాబట్టాలి. ఇక ఈ రెండు సినిమాలు రెండవ వారం బాగానే పెర్ఫార్మ్  చేస్తాయేమో చూడాలని బయ్యర్స్ ఆశపడుతున్నారు. కూలీ ఓవరాల్ గా రూ. 500 కోట్ల లోపే ముగిసే అవకాశం ఉందని, అలానే వార్ 2 కూడా రూ. 400 కోట్ల మేర ముగుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి మొత్తం రన్ పూర్తి అయితేనే గాని పక్కాగా ఇవి ఎంతమేర లాభం లేదా నష్టం తెచ్చిపెట్టాయనేది చెప్పగలం.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version