Home Movie News ‘వార్ – 2’ ట్రైలర్ : ఆశించిన స్థాయిలో లేదు 

‘వార్ – 2’ ట్రైలర్ : ఆశించిన స్థాయిలో లేదు 

war 2

బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కియారా అద్వానీ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ 2. ఈ మూవీని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ గ్రాండ్ గా నిర్మిస్తుండగా మూవీని ఆగష్టు 14న భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ సినిమా పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ ల పవర్ఫుల్ డైలాగ్స్ అదిరిపోవడంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి.

అయితే ముఖ్యంగా విజువల్స్ తో పాటు విఎఫ్ఎక్స్ అంశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కేవలం పర్వాలేదనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ విఎఫ్ ఎక్స్ రేపు థియేటర్స్ లో ఆడియన్స్ ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. తెలుగు తో పాటు గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్సు ముందుకి త్వరలో రానున్న వార్ 2 మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version