Home Movie News త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజక్ట్స్ లాక్ 

త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజక్ట్స్ లాక్ 

trivikram srinivas

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.

బాగానే విజయం అందుకున్న ఆ మూవీ అనంతరం ఆయన అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చింది. కాగా వారిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ మైథలాజికల్ ఎంటర్టైనర్ ని హారికా హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ప్లాన్ చేసాయి. అయితే కొన్ని కారణాల వలన అల్లు అర్జున్ దాని ప్లేస్ లో అట్లీ తో మూవీ ప్రారంభించారు.

దానితో తదుపరి తన సినిమాని వెంకటేష్ తో ప్లాన్ చేసారు త్రివిక్రమ్. ఇక ఆయన వెంకటేష్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాలు లాక్ అయినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని సంస్థల నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేసారు.

కాగా వెంకటేష్ మూవీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అలానే ఎన్టీఆర్ మూవీ మైథలాజికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజక్ట్ అనంతరం త్రివిక్రమ్ తదుపరి మూవీ లాక్ అయితే తానే స్వయంగా చెప్తానని ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు నాగవంశీ. 

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version