Home Movie News ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కలెక్షన్ క్రాష్ అయిన ‘థగ్ లైఫ్’

ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కలెక్షన్ క్రాష్ అయిన ‘థగ్ లైఫ్’

కమలహాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల అనంతరం కమలహాసన్ తో కలిసి మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

నాజర్, తనికెళ్ళ భరణి, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు చేసిన ఈమూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. అయితే ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం చాలా ఏరియాల్లో డిజాస్టర్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

ఇప్పటివరకు కేవలం రూ.80 కోట్ల గ్రాస్ వద్ద మాత్రమే నిలిచిన తగ్ లైఫ్ మూవీ అటు తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయట్లేదు.

మొత్తంగా తమిళనాడులో ఐదు రోజుల్లో ఈ మూవీ రు. 35 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఈ సినిమా నెగిటివ్ టాక్ తో దారుణంగా రన్ అవుతుంది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా అనేక ఏరియాల్లో థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్ కలెక్షన్లతో కమల్ కెరీర్ లో మరొక భారీ పరాజయం దిశగా కొనసాగుతుంది.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version