Home Movie News ‘ది రాజాసాబ్’ టీజర్ : వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ 

‘ది రాజాసాబ్’ టీజర్ : వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ 

the rajasaab

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా మారుతీ దర్శకతంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్.

ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్ర చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి నేడు ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ టీజర్ లో ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వింటేజ్ ప్రభాస్ ని చూడవచ్చు. ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ స్టైల్, డైలాగ్స్ బాగున్నాయి. హర్రర్ అంశాల తో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి.

అలానే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తంగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్ అందరినీ ఆకటుటకుంటూ డిసెంబర్ 5న రిలీజ్ కానున్న మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసింది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


Show comments
Exit mobile version